టీమిండిమా కెప్టెన్ విరాట్ కోహ్లి కుమార్తె పేరు గంటల వ్యవధిలోనే ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎలాగంటే ఈరోజు కోహ్లీ అనుష్క దంపతులు తమ కుమార్తెకు వామిక అని నామకరణం చేశారు. తొలిసారి ఆమె ఫోటోను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఇక విరాట్ పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడో వీరాభిమాని. 8 నెలలు వెయిట్ చేసి కోహ్లి తన కుమార్తెకు పెట్టిన పేరునే తన బిడ్డకు పెట్టుకున్నాడు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం, మైలారం శివారు తండాకి చెందిన బానోత్ సంతోష్.. విరాట్ కోహ్లికి పెద్ద అభిమాని. సంతోష్ దంపతులకు గత ఏడాది జూన్ 15న అమ్మాయి జన్మించింది. అయితే విరాట్ కోహ్లి- అనుష్క దంపతులకు పుట్టబోయే బిడ్డకు పెట్టే పేరునే తన బిడ్డకు కూడా పెట్టుకోవాలని అతడు నిశ్చయించుకున్నాడు. అప్పటినుంచి ఎనిమిది నెలలు వేచి చూశాడు. సోమవారం కోహ్లి దంపతులు తమ కుమార్తెకు ‘వామిక’ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే రావడంతో సంతోష్ తన కూతురుకి కూడా ‘వామిక’ అని పేరు పెట్టి మురిసిపోయాడు.