Friday, April 26, 2024
- Advertisement -

ఊహించని ఆఫర్‌ కొట్టేసిన మోనాల్‌ గజ్జర్‌!

- Advertisement -

బిగ్‌బాస్‌ 4 ఫేమ్‌ మోనాల్‌ గజ్జర్‌ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. బిగ్‌బాస్‌ రియాల్టీ షో నుంచి వచ్చాక ఈ బ్యూటీ రాత మారిపోయింది. అప్పటివరకు ఐదారు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు ఒక్క బిగ్‌బాస్‌తో సొంతం చేసుకుంది.
ఆతర్వాత వరుసగా టాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటుంది. దర్శకనిర్మాతలు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నారు. హౌస్‌ నుంచి బయటకు వచ్చిన కొద్ది రోజులకే తనకు గుర్తింపు దక్కిన స్టార్‌ మాలోనే కొత్త షో డ్యాన్స్‌ ప్లస్‌లో జడ్జిగా రెండో జర్నీ మొదలు పెట్టింది.

ఆ తర్వాత ‘అల్లుడు అదుర్స్’సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి మోనాల్ స్టెప్పులేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ ఫాస్ట్ బీట్‌కు మోనాల్ స్టెప్పులు అదిరిపోయాయని అన్నారు. అలాగే, ఆమె గ్లామర్ కూడా ప్లస్ అయ్యిందని కొనియాడారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ గుజరాతి భామకు ఊహించని ఆఫర్‌ వచ్చిందట. టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’లో స్టెప్పులేసే అవకాశం వచ్చిందట. ఇప్పటికే చిత్రబృందం మోనాల్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ఇదే గనుక నిజమైతే మోనాల్ బంపరాఫర్ కొట్టేసినట్టే.

పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సొంత జిల్లాలో చంద్ర‌బాబుకు చేదు అనుభ‌వం!

కొత్త చరిత్ర సృష్టించబోతున్న రౌడీ బేబీ

బాబోయ్‌.. అనసూయ డిమాండ్‌ మాములుగా లేదుగా..

నిమ్మ‌గ‌డ్డ తీరు.. బీజేపీ ప్ర‌శ్న‌ల వ‌ర్షం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -