Thursday, March 28, 2024
- Advertisement -

విరాట్-అనుష్కల పాప పేరు ఇదే!

- Advertisement -

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతుల తొలి సంతానానికి పేరు పెట్టేశారు. దాంతోపాటు తొలిసారిగా చిన్నారి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేట్టుగా పాపకు వామిక అని నామకరణం చేశారు. అనుష్క ఈ చిన్నారికి జనవరి 11న జన్మనిచ్చింది. లాక్ డౌన్ సమయంలో అనుష్క గర్భవతి అని తెలిసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు అనంతరం కోహ్లీ స్వదేశానికి బయలుదేరి వచ్చిన విషయం విదితమే.

ఇండియాలో మోస్ట్ సెలబ్రెటేడ్, పాపులర్ కపుల్ అయిన ఈ జంటకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.అలాంటిది వారికి పాప పుట్టింది అంటే అభిమానులకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంది. అయితే కూతురు జన్మించిన వెంటనే విరాట్ అనుష్క తమ బిడ్డ ప్రైవసీకి భంగం కలిగించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సమయం చూసి మరిన్ని వివరాలు చెప్తామని కపేర్కొన్నారు. తాజాగా ఆమె పేరును ఫోటోను పంచుకున్నారు. ఇక వామికకు సంబంధించిన ఫోటోను వారు తొలిసారిగా షేర్ చేయడంతో అది వైరల్ అయింది.

పాప ఫోటో తో పాటు అనుష్క శర్మ ఇంస్టాగ్రామ్ పోస్టులో ఎమోషనల్ రైటప్ కూడా జోడించింది అనుష్క. ‘మేము ప్రేమలో కలిసి ఉన్నాం. మా ప్రేమ, విశ్వాసం వామిక రాకతో మరికొత్త రూపం సంతరించుకుంది. కన్నీళ్లు, నవ్వు, ఆందోళన, ఆనందం.. కొన్ని నిమిషాల వ్యవధిలో అనుభవించిన భావోద్వేగాలు ఎన్నో .. మీ కోరికలు, ప్రార్థనలు మాకు మరింత శక్తిని ఇచ్చాయి. అందరికీ ధన్యవాదాలు’ అని అనుష్క పేర్కొంది. కాగా మన పురాణాల ప్రకారం వామిక అనేది దుర్గామాతకు మరో పేరు గా తెలిసింది.

కేంద్ర బడ్జెట్ 2021: సీనియర్‌ సిటిజన్లకు శుభవార్త

ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్‌న్యూస్‌!

పవన్ తో మూవీ.. సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా?

ఊహించని ఆఫర్‌ కొట్టేసిన మోనాల్‌ గజ్జర్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -