Friday, May 3, 2024
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న బిజేపీ.. జగన్ సీఎం పక్కా..

- Advertisement -
Bjp Big Shock Chandrababu Next Cm Jagan Confirm

రాబోతున్న ఎన్నికల్లో టీడీపీకి బిజేపీ పెద్ద షాక్ ఇవ్వబోతుందా.. ప్రతిపక్ష వైఎస్ జగన్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించడానికి పరోక్షంగా సాయపడుతుందా.. చంద్రబాబుకు దిమ్మతిరిగే దెబ్బ తగలబోతుందా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే.. నిజమే అనిపిస్తోంది. బిజేపీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడంతో ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ పెట్టింది. ప్రధానంగా.. ఏపీ, తెలంగాణలో బిజేపీ అధ్యక్షడు అమిత్‌షా పాగా వేయాలని చూస్తున్నాడు.

అయితే ఏపీలో టీడీపీతో బిజేపీ అంటకాగుతుండగా.. తెలంగాణలో కేసీఆర్ కు వ్యతిరేకంగా బలీయమైన శక్తిగా ఎదగడానికి ట్రై చేస్తోంది. ఏపీలో టీడీపీ తో పొత్తుపెట్టుకుని 15 సీట్లలో పోటీ చేసి కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది..కానీ ఈ సారి మాత్రం బిజేపీ టీడీపీకి 80 సీట్లను డిమాండ్ చేయాలని భావిస్తుంది. అయితే ఏపీలో శాసన సభాస్థానాలు పెంచి వాటిలో తమకు 80 స్థానాలు కావాలని చంద్రబాబును డిమాండ్ చేసే అవకాశం ఉంది..బిజేపీ వ్యూహం తెలిసి చంద్రబాబు బిత్తరపోయాడని సమాచారం..80 స్ధానాలు బిజేపీకి ఇస్తే టీడీపీ సంకనాకిపోతుందని చంద్రబాబుకు తెలుసు.. కనీసం 70 స్థానాల్లో పోటీ చేయకుండానే వైసీపీ చేతుల్లో పెట్టినట్లే, చేజేతులా జగన్‌ కు అధికారం అప్పగించాల్సి వస్తుందని చంద్రబాబు భయపడుతున్నాడు. అసలే 2019 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ప్రతి సీటుకు పెద్ద ఎత్తున పోటీ జరగనుందని తెలిసిన విషయం.

దాంతో బీజేపీ అసందర్భమైన డిమాండ్లను చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదు. సో బీజేపీ, టీడీపీ మధ్య ఉన్న పోత్తు బ్రేకప్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రెండో ఆప్షన్ గా బీజేపీ వైసీపీతో పొత్తు కు లేదా మద్దతుకు కూడా రెడీ అయ్యే చాన్స్ ను కొట్టిపడేయలేం. అందుకే బీజేపీ ఎత్తు వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అనే విషయంపై బాబుకు క్లారిటీ వచ్చేసింది. మరి బీజేపీ తో బాబు రాజీ పడీ 80 సీట్లకు బదులు 40 సీట్లు ఇస్తామని బేరమాడుతాడో…లేకుంటే బిజేపీతో పొత్తు కు బ్రేకప్ చెపుతాడో నిర్ణయం బాబు చేతిలో ఉంది.

అయినా ఎంత మోడీ వేవ్ ఉన్నా.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలో మాట తప్పిన బిజేపీ, టీడీపీ కూటమికి ఈ సారి పొత్తు కలిసిరాదని.. ఖచ్చితంగా ప్రతిపక్ష వైసీపీ వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపే చాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక వేళ బిజేపీ, టీడీపీ పొత్తు ఉన్నా, జనసేన , కమ్యూనిస్టులు మిత్ర పక్షాలుగా పోటీ చేసి అంతిమంగా ప్రతిపక్ష వైసీపీ పరోక్షంగా మద్దతు పలికే చాన్స్ ఉందని అంటున్నారు. 2019 లో జగన్ని ముఖ్యమంత్రి కాకుండా ఏ శక్తి ఆపలేదని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

Related

  1. టీడీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్ సత్తా ఏంటో చెప్పిన జలీల్ ఖాన్
  2. ఊహించని ప్లాన్ వేసిన జగన్.. టీడీపీకి దిమ్మతిరగడం ఖాయం
  3. జగన్ కు ఎంత గొప్ప మనసు ఉందో ఇది చదివితే తెలుస్తుంది
  4. రాజకీయాల్లో సంచలనం.. వైసీపీలోకి మాజీ మంత్రి.. సీటు కన్ఫర్మ్ చేసిన జగన్…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -