Monday, May 13, 2024
- Advertisement -

ఈనెల 28కి తీర్పును రిజ‌ర్వ్ చేసిన సీబీఐ కోర్టు

- Advertisement -
CBI Court reserves order YS Jagan bail petition case

జ‌గ‌న్ బేయిల్‌ను  ర‌ద్దుపై స‌స్పెన్స్‌ కొన‌సాగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై ఈనెల 28న తీర్పు వెలువడనుంది. జగన్ షరతులను ఉల్లంఘించారని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది.

సాక్షులను ప్రభావితం చేయరాదన్న షరతును జగన్ ఉల్లంఘించారని.. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూను సాక్షి టీవీలో ఇచ్చారని వెంట‌నే జ‌గ‌న్ బేయిల్ ర‌ద్దుచేయాల‌ని కోరింది.

 దీనిపై కోర్టులో వాద‌న‌లు పూర్త‌య్యాయి.సాక్షి నిర్వహణతో, రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూతో తనకు సంబంధం లేదనేది జగన్ వాదన. సీబీఐ పిటిషన్ ను కొట్టివేయాలని కోర్టును  జగన్ కోరారు. సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్, జగన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాద‌న‌లు వినిపించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో సుమారు నాలుగు గంటల పాటు వాదనలు జరిగాయి. జగన్, విజయ్ సాయిరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ఈనెల 28కి వాయిదా వేసింది. 

మే 15 నుంచి జూన్ 15 మధ్య పదిహేను రోజులు కుటుంబ సభ్యులతో కలిసి న్యూజిలాండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుత దశలో విదేశాలకు వెళ్లడానికి జగన్ కు అనుమతి ఇవ్వవద్దని సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పిటిషన్ పై నిర్ణయాన్ని కూడా ఈనెల 28న న్యాయస్థానం వెల్లడించనుంది. సీబీఐ కోర్టు  ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందోన‌ని వైసీపీ శ్రేనులు ఆందోళ‌న‌లో ఉన్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -