Monday, May 20, 2024
- Advertisement -

టీ టీడీపీని.. బాబు వదిలేసినట్టేనా?

- Advertisement -

అటు అధికారం.. ఇటు అయోమయం అన్నట్టు తయారైంది తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ లో చూస్తే.. అధికారం దక్కించుకుని.. వరుసగా ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ దూసుకుపోతోంది టీడీపీ. ఇటు తెలంగాణలో చూస్తే.. ఉన్న ఒక్కగానొక్క ఎంపీ మల్లారెడ్డితో పాటు.. ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా చేజారిపోయారు. దీంతో.. తెలంగాణలో టీడీపీకి దశ దిశ లేకుండా పోయింది.

ఆఖరికి.. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి తొలగించి.. గుంటూరుకు షిఫ్ట్ చేసేసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో.. తెలంగాణలో పార్టీని లైట్ తీసుకోవడమే మంచిదన్న నిర్ణయానికి టీడీపీ ముఖ్య నాయకత్వం వచ్చినట్టు కనిపిస్తోంది. ఎలాగూ బలం లేదు.. ఉన్న కాస్త బలాన్ని టీఆర్ఎస్ ఆకర్షిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. తెలంగాణలో టీఆర్ఎస్ ను కాదని.. రాజకీయంగా పోరాడే అవకాశం కూడా లేదు. ఈ వాస్తవాల్ని గ్రహించిన పార్టీ నాయకత్వం.. టీ టీడీపీకి పూర్తి స్థాయిలో పోరాటం హక్కులు కట్టబెట్టినట్టు తెలుస్తోంది.

మీ పరిస్థితులకు అనుగుణంగా మీరే నిర్ణయాలు తీసుకోండి… అంటూ గతంలో బాబు కూడా తెలంగాణ పార్టీ నాయకత్వానికి సూచించినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే.. ఇప్పటివరకూ రాజకీయాలు నడుస్తున్నాయి. దీంతో.. అసలు చంద్రబాబు కూడా.. తెలంగాణ వైపు.. ఆ మాటకొస్తే హైదరాబాద్ వైపు కూడా చూడడం తగ్గించేశారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు చోటు కల్పించింది తానే.. అని కూడా చెప్పుకోవడం కూడా తగ్గించారు. చూస్తుంటే.. తెలంగాణను చంద్రబాబు లైట్ తీసుకున్నారన్న గుసగుసల్లో ఎంతో కొంత నిజం ఉన్నట్టే కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -