సినిమాలోనే కాదు బయట కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రభంజనం. పవన్ కోసం ఏం చేయడానికైన వెనకడారు కొందరు అభిమానులు. అలానే సినీ పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనతో నటించడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. హీరోలు, హీరోయిన్లు సైతం పవన్ తో నటించాలని ఆశపడుతుంటారు.
అలా ఆయన భక్తులలో ఒకడు హీరో నితిన్. ఇష్క్ సినిమా నుంచి మొదలు, పవర్ స్టార్ భజనతో, రిఫరెన్సులతో నితిన్ స్టార్ మారిపోయింది. అక్కడినుంచి ఇద్దరి మధ్య బంధం కూడా బాగా బలపడింది. మెగాస్టార్ నుంచి వరుణ్ వరకు, ఎవరి సినిమాల ఫంక్షన్స్ కి వెళ్ళని పవన్, నితిన్ ఫంక్షన్స్ కి మాత్రం వెళ్ళేంతగా, ఆఖరికి రామ్ చరణ్ తో సినిమాని పక్కనపెట్టి పవన్ తన నిర్మాణంలో నితిన్ తో సినిమా మొదలుపెట్టేంతేగా. వీరి బంధం భవిష్యత్తులో రాజకీయంగా కూడా బలపడనుందని తెలుస్తోంది. జనసేన ప్రస్తుతం కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
జనసేనను ఇటు తెలంగాణలో కూడా బలపరిచే ప్లాన్ ఉన్నాడట పవన్ కళ్యాణ్. తెలంగాణలో పార్టీ బాధ్యతలు నితిన్ చేతిలో పెట్టాలనే ఆలోచన పవన్ ఉన్నట్లు.. ఫిలింనగర్ లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. నితిన్ అంటే పవన్ కి పూర్తిగా అవగాహన ఉండటం.. ఇద్దరి మధ్య స్నేహం, వీటితో పాటు పార్టీ కోసం డబ్బు ఖర్చుపెట్టగల కెపాసిటి నితిన్ దగ్గర ఉండటంతో.. ఈ కుర్ర హీరోనే తెలంగాణలో పార్టీ అధ్యక్షుడి పదవికి అర్హుడని పవర్ స్టార్ భావిస్తున్నాడట. అంతకుమించి చెప్పాలంటే, తెలంగాణ నుంచి వచ్చిన నటులందరిలోకి నితిన్ రేంజ్ వేరు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాక ఇంకేం కావాలి. అయితే దీని మీద ఎలాంటి ప్రకటన లేకపోవడంతో నమ్మకపోవడమే బెటర్.
Related