Monday, May 13, 2024
- Advertisement -

పవన్ కు జనసేనా.. మరి మహేష్ బాబు కు..?

- Advertisement -
Mahesh About Political Entry

సినిమాల నటునటులు ముదిరితే.. రాజకీయవేత్త అవుతాడనేది ఎప్పటి నుంచో వస్తుంది. అందుకు తగ్గట్టే చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి తమదైన ముద్ర వేసారు. అయితే అందరు సినీ తారలు రాజకీయాల వైపు వెళ్లాలని లేదు. కొందరికి రాజకీయాలంటే ఇంట్రెస్ట్‌ వుండకపోవచ్చు. అలాంటి వారిలో తానూ ఒకడినంటున్నాడు మహేష్‌బాబు.

పవన్ కళ్యాణ్ జనసేనా పార్టీ పెట్టినట్లు మీరు కూడా ఏదైన పార్టీ పెడుతారా.. లేక వేరే పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నకి.. మహేష్ బాబు సమాధనం ఇస్తూ.. తనకు రాజకీయల మీద అవగాహన లేదని.. తనకు సినిమా ఒక్కటే తెలుసని.. ఎప్పటికి సినిమాలోనే నటిస్తానని.. రాజకీయాల్లోకి వెళ్లానని గట్టిగా చెప్పాడు. మహేష్ తండ్రి కృష్ణ.. ఎంపీగా చేసారు.. ఇప్పుడు మహేష్ బావా గళ్లా జేయదేవ్.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. . తన ఫ్యామిలీలో రాజకీయాల పట్ల ఆసక్తి వున్నప్పటికీ తనకి మాత్రం దాని గురించి తెలిసింది సున్నా అని మహేష్‌ పేర్కొన్నాడు.

భవిష్యత్తులోను తాను అడుగు పెట్టని రంగం ఏదైనా వుంటే అది ఇదేనని స్పష్టం చేసాడు. హీరోలు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి అందరూ బురద జల్లుతూనే వుంటారు. గతంలో ఏమో కానీ ఈమధ్య రాజకీయాల్లోకి వచ్చి రాణించిన తారలెవరూ లేరు. ఈ నేపథ్యంలో మహేష్‌దే ఉత్తమమైన నిర్ణయమేమో. పూలు వేయించుకున్న చోటే రాళ్లు వేయించుకోవాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు కదా!

Related

  1. పవన్ సినిమాలో చిరంజీవి అక్క పాత్ర ఇదే
  2. ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ
  3. మహేష్ బాబుపై సంచలన కామెంట్స్ చేసిన ఎన్టీఆర్
  4. చిరు, చరణ్ లపై మహేష్ కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -