Thursday, May 2, 2024
- Advertisement -

ఇర‌కాటంలో జ‌న‌సేన‌…. పవన్ చూపుఎటూ

- Advertisement -
Jenasena in 2019 elections

జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ణ్‌క‌ళ్యాన్ విష‌యంలో ఒక క్లారిటీ లేకుండా పోతోందా ! అంటే అవున‌నే  స‌మాధానాలు వినిపిస్తున్నాయి.ఒక‌వైపు … సినిమాలు తీస్తూ   మ‌రోవైపు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై స్పందిస్తున్నారు. కానీ ఆయన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని ఇతర పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేసేందుకు అ న్ని ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు.అయితే ఎప్పుడు ఏంమాట్లాడుతాడో ఎలా స్పందిస్తాడో చెప్ప‌లేం.ప‌వ‌ణ్ క‌ళ్యాన్ టీడీపీ,బీజేపీకీ మ‌ద్దుతుగా వెల్లినా ఇర‌కాటంలో ప‌డిన‌ట్లేన‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

2019 నాటికి ఎలా ముందుకెళ్లాలి? ఏం చేయాలి? ఎవరితో కలవాలి? ఇలా.. ఎన్నో అంశాలపై పవన్ కళ్యాణ్‌కు క్లారిటీ ఉందా? ఆయన అసలు ఎవరి వైపు ఉంటున్నారు? అర్థం కావడం లేదని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై స్పందించడాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఆయన సమస్యపై స్పందిస్తే.. ప్రభుత్వం నుంచి స్పందన కూడా వస్తోంది. మరో విషయమేమంటే.. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం వచ్చానని చెబుతున్నారు. సమస్యలపై ఆయన స్పందన కూడా అలాగే కనిపిస్తోంది. కానీ ఆయన అడుగులు ఎటువైపు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని ఇతర పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు.. ప్రత్యేక హోదాతో పాటు పలు సమస్యలు మొదలు.. నిన్నటి అగ్రిగోల్డ్ వ్యవహారం వరకు పలు అంశాలను వైసిపి లేవనెత్తిన తర్వాత పవన్ రంగంలోకి దిగారు. ఇది వైసిపిని కార్నర్ చేసేందుకా? చంద్రబాబును కాపాడేందుకా? లేక ప్రతిపక్షానికి తోడై చంద్రబాబును ఇరుకున పడేసేందుకా? అనే విషయం అర్థం కావడం లేదంటున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తే అది వైసీపీకే  ల‌బ్ధిచేకూరుతుంద‌నీ పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.ఎందుకంటే ఒంట‌రిగా పోటీ చేయ‌డంవ‌ల్ల ఎక్కువ‌గా టీడీపీ  ఒటుబ్యాంక్ చీలి అది వైసీపీకే లాభం చేకూరుతుంది.వైసీపీకీ చెందిన ఒటుబ్యాంక్ చెక్కుచెద‌ర‌దు.ఇప్ప‌టికే మంత్రిప‌ద‌వులు రాని టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల‌టైంలో జ‌నసేన‌లోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్న‌ట్ల స‌మాచారం.ప్ర‌త్యేక‌హ‌దా కోస‌మే ప‌వ‌ణ్ బీజేపీ,టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన ప‌వ‌ణ్‌ను ప్ర‌జ‌లు న‌మ్మారు. త‌ర్వాత ప్ర‌త్యేక హోదాపై చేతులెత్తేయ‌డంతో ప‌వ‌ణ్ ప‌రిస్తితులో మార్పు వ‌చ్చింది.అప్ప‌టినుంచి ప‌వ‌ణ్ టీడీపీకీ వ్య‌తిరేకంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై  స్పందిస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో అన్నీ మ‌ర‌చి బీజేపీ,టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తే ప్ర‌జల్లో తీవ్ర‌వ్య‌తిరేక‌త ఎదుర్కొన‌క త‌ప్ప‌దు.ఇక ప్ర‌జ‌లు న‌మ్మెప‌రిస్తితుల్లో  ఉండ‌రు కాబ‌ట్టి ప్ర‌త్యామ్నాయంగా అది వైసీపీకే లాభం చేకూరుతుంది.తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ప్రజల కోసం వచ్చానని చెబుతున్న ప‌వ‌ణ్ …. అదే రీతిలో  సమస్యలపై ఆయన స్పందన కూడా అలాగే కనిపిస్తోంది.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా,రైల్వేజోన్ అంశాల‌పైనే ప్ర‌ధానంగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌డంలో సందేహంలేదు. కమ్యూనిష్ట్ పార్టీల‌తో క‌ల‌సి ఒంటరిగా పోటీచేస్తాడాలేకా  ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీకి మ‌ద్ద‌తుగానే వెల్లాల‌నీ ఎటూ తేల్చుకోలేని ప‌రిస్తితుల్లో ఉన్నాడు ప‌వ‌ణ్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -