Sunday, June 16, 2024
- Advertisement -

ట్రంప్ గెలుపుకీ మాకూ సంబంధం లేదు – ఫేస్ బుక్

- Advertisement -
Mark Zuckerberg responds to accusation Facebook helped win Donald Trump

అమెరికా ఎన్నికల్లో గెలిచిన నాయకుడు.. నా విజయంలో మీ పాత్ర ఉంది అంటూ ఎవరికైనా క్రెడిట్ ఇస్తే అది తీసుకోవడానికి అవతలి వాళ్లు చాలా ఆనంద పడాలి. కానీ ఫేస్ బుక్ యాజమాన్యం మాత్రం ఆ క్రెడిట్ మాకొద్దు బాబోయ్ అంటోంది. ఎందుకంటే ఆ క్రెడిట్ తీసుకుంటే ఇప్పుడు ఆ సంస్థ క్రెడిబిలిటీనే దెబ్బ తినే ప్రమాదం పొంచి ఉంది. మొన్నటి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనూహ్య విజయం సాధించడంలో ఫేస్ బుక్ పాత్ర ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ఫేస్ బుక్లో ట్రంప్కు అనుకూలంగా చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని.. దాని వల్ల లక్షలాది మంది ప్రభావితం అయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ గెలుపు కోసం ఫేస్ బుక్ భారీగా ఖర్చు కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్న తరుణంలో స్వయంగా ట్రంపే ఆ అనుమానాలకు బలం చేకూర్చేలా మాట్లాడాడు. ఆదివారం నాడు ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘నాకు ఫేస్ బుక్.. ట్విట్టర్.. ఇన్ స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. నేను గెలవడానికి అవీ ఓ కారణమే.

నా కంటే కూడా వాళ్లే నా విజయం కోసం చాలా డబ్బు ఖర్చుపెట్టారు’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో ఫేస్ బుక్ మీద అందరికీ సందేహాలు తలెత్తాయి. ఐతే ఇది తమ క్రెడిబిలిటీని దెబ్బ తీసేలా ఉండటంతో ఫేస్ బుక్ యాజమాన్యం అప్రమత్తమైంది. ఫేస్ బుక్ లో వచ్చే కంటెంట్లో 99 శాతం విశ్వసనీయత ఉన్నదని.. మిగతా ఒక్క శాతం మాత్రం ఫేక్ న్యూస్ ఉండొచ్చని.. ఇది ఎక్కడైనా జరిగేదే అని ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించాడు. ట్రంప్ కు మద్దతుగా తాము ప్రత్యేకంగా చేసిందేమీ లేదని కూడా ఫేస్ బుక్ యాజమాన్యం స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -