Friday, March 29, 2024
- Advertisement -

షభాష్ బైడన్ అంటున్న ట్రంప్.. కారణం అదేనా!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మొన్నటి వరకు బైడెన్ పై గుర్రుగా ఉంటూ వచ్చిన ట్రంప్ ఆయన్ని ప్రశంసించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అసలు విషయానికి వస్తే.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి తీసుకోవాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు ట్రంప్.

కాకపోతే అందుకు విధించిన గడువు విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. సెప్టెంబరు 11వ తేదీలోపు ఆఫ్ఘనిస్థాన్ నుంచి సేనలను వెనక్కి పిలిపిస్తామంటూ గతవారం బైడెన్ ప్రకటించారు. అయితే మే 1 నాటికి ఆ పనేదో పూర్తిచేస్తే బాగుంటుందని అన్నారు ట్రంప్. ఆప్ఘనిస్థాన్‌ను విడిచిపెట్టడమనేది అద్భుతమైన, సానుకూల విషయమని ట్రంప్ ప్రశంసించారు. ఇక ఆప్ఘనిస్థాన్ నుంచి దళాలను వెనక్కి తీసుకునేందుకు సెప్టెంబరు 11ను గడువుగా పెట్టుకోవద్దని బైడెన్‌ను కోరుతున్నా అన్నారు.

ఇందుకు రెండు కారణాలున్నాయని.. ఆఫ్ఘనిస్థాన్‌లో మన సేనలు అడుగుపెట్టి 19 ఏళ్లు దాటిందని, కాబట్టి వీలైనంత త్వరగా వెనక్కి రప్పించాలని అన్నారు. సెప్టెంబరు 11 అనేది ఓ విషాద ఘటనకు గుర్తు అని, ఆ రోజు తమ ప్రాణాలను కోల్పోయిన వారిని మననం చేసుకునేందుకు ఆ రోజును విడిచిపెట్టేయాలని కోరారు.

గత20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలుకుతూ సేనలను వెనక్కి పిలిపించాలన్న బైడెన్ నిర్ణయంపై మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా కూడా ప్రశంసించారు. ఇదిలా ఉంటే మొన్నటి వరకు బైడెన్ అంటే కస్సు బుస్సు అనే ట్రంప్ ఆయన్ని మెచ్చుకోవడంపై సొంత పార్టీ నేతలు ఫైర్ అవుతున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ పెట్టకపోతే.. మేమే పెడతాం: హై కోర్టు

సినీమా రికార్డ్స్ బ్రేక్ చేసిన మాస్క్ లేని ప్రజలు..!

హై కోర్టు వరుస ప్రశ్నలు.. కరోనా కి బార్ లకి ఏమిటి లింక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -