ఒకే ఒక్క నోట్ల రద్దు నిర్ణయం తో అందరికీ చిచ్చు పోయ్యిస్తున్న నరేంద్ర మోడీ దగ్గర ఇంకా బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి అంటున్నారు. ఆయన ఎలాంటి పరిస్థితి ని అయినా తట్టుకుని నిలబడగల మనిషి కావడం తో ఆయన మనసులో ఇలాంటి ఆలోచనలు చాలా ఉన్నాయ్ అనీ ఒక్కసారి ఈ బ్లాక్ మనీ వ్యవహారం అంతా సర్డుమనిగిపోతే ఖచ్చితంగా అన్నీ తీర్చగలను అంటున్నారు ఆయన. అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించే మరిన్ని సూపర్ నిర్ణయాలు తీసుకోవడానికి మోడీ దగ్గర బోలెడంత టైం ఉంది.
కనీసం ఒక ఆరునెలల పాటు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సర్డుమనిగితే వెంటనే అటువైపు ఆయన దృష్టి పెడదాం అని చూస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారంగా ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించిన ప్రత్యేక కథనంలో ఆసక్తికర అంశాలు బోలెడన్ని ఉన్నాయి. ఉదాహరణ కి ఈ పెద్ద నోట్ల రద్దు తరవాత పరిణామాలే తీసుకుంటే పెద్ద నోట్ల రద్దు ముందు వరకూ ఎంత మొత్తాన్నిఅయినా బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం.. ఎంత మొత్తమైనా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది.
దాన్ని పూర్తిగా మార్చాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. వచ్చే ఏడాది మొదటి నుంచి.. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే మొత్తం మీదా.. విత్ డ్రా చేసే మొత్తం మీద పరిమితులు విధించాలన్నది తాజా నిర్ణయంగా చెబుతున్నారు. సేవింగ్స్ ఎకౌంటు లో రోజుకు యాభై వేలు కరంట్ లో లక్ష కంటే ఎక్కువ విత్ డ్రా చేసే ఛాన్స్ లేకుండా చేస్తారు మోడీ.విత్ డ్రా కంటే కూడా.. మనీ ట్రాన్స్ ఫర్లు.. చెక్కులు.. డీడీలను.. ప్లాస్టిక్ మనీని అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.