Saturday, May 18, 2024
- Advertisement -

ఓ ఉద్యోగి కేసు తారుమారు

- Advertisement -

సిలికాన్ వ్యాలీలో అతి పెద్ద ఐటి సంస్ధ ఒరాకిల్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో పడిపోయాయి. ఈ మార్కెట్ లో  నాలుగు శాతం మేర షేర్లు పడిపోయినట్లుగా తెలుస్తోంది. ఒరాకిల్ కంపెనీలో మాజీ అకౌంటెంట్ పై నమోదైన విజిల్ బ్లోయర్ దావాతో ఈ షేర్లు పడిపోయాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటాను ఎక్కువగా చేసి చూపించడంతో ఆ అకౌంటెంట్ పై కేసు నమోదైంది.

శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెరికా జిల్లా కోర్టులో ఈ కేసు బుధవారం నాడు నమోదైంది. అకౌంటెంగ్ స్వెత్లానా బ్లాక్బర్న్ అమ్మకాల వసూళ్లను అంచనాల కంటే ఎక్కువ మిలియన్ డాలర్లులో చూపించడంతో కేసు నమోదు చేశారు. స్వెత్లానా బ్లాక్బర్న్ చూపించిన క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటా అశాస్త్రీయమని దావాలో పేర్కొన్నారు.

మరోవైపు ఒరాకిల్ సంస్ధ ఈ ఆరోపణలను కొట్టివేసింది. తమ సంస్ధ త్వరలో కౌంటర్ దావా దాఖలు చేస్తామని పేర్కొంది. మాజీ ఉద్యోగి తమ సంస్ధలో తక్కువ కాలం పని చేసిందని, పైగా అకౌంటింగ్ గ్రూప్ లో ఆమెకు పరిచయమే లేదని కొట్టిపారేసింది. అయితే ఈ కేసు వివాదం బయటకు రాగానే షేర్లు విలువ తగ్గిపోవడం గమనార్హం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -