Wednesday, May 15, 2024
- Advertisement -

విచ్చ‌ల‌విడిగా మార్కెట్‌లో ప్లాస్టిక్ కోడి గుడ్లు….

- Advertisement -
Plastic eggs in Uttrakanda

ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న నిత్యావ‌స‌ర వ‌స్తుల‌న్నీ క‌ల్తీమ‌యం.ప్ర‌జ‌లు ఏవి కొనాలో …ఏవి కొన‌క‌డ‌దో తీవ్ర గంద‌ర‌గోలంలో ఉన్నారు.చంటిపిల్లాడి పాల‌కాన్నుంచి …. బియ్యం వ‌ర‌కు క‌ల్తీతో ముంచెత్తుతున్నాయి.

ఇక కూర‌గాయ‌లు కూడా క‌ల్తీమ‌యం.ఇందులేడ‌ని సందేహంబువ‌ల‌దు ఎందెందు వితికినా ఉండుట్లు…ఇప్పుడు క‌ల్తీకూడా అలానే త‌యార‌య్యింది.ఇప్పుడు తాజాగా మ‌రో క‌ల్తీ గుట్టు బ‌య‌ట ప‌డింది.
ఇప్పుడు ప్లాస్టింగ్ కోడి గుడ్లు కూడా మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ప్లాస్టిక్‌ కోడిగుడ్లు కలకలం రేపాయి. హల్ద్‌వానీలో ఓ వ్యక్తి కోడి గుడ్లను ఉడికించగా… అవి ప్లాస్టిక్‌లా మారడంతో ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహారంపై స్పందించిన స్థానిక అధికారులు కోడిగుడ్లును పరీక్షించి ఏవైనా రసాయనాలు వాటిలో ఉన్నాయోమో తేలుస్తామని చెప్పారు.

{loadmodule mod_custom,GA2}

గ‌తంలో కూడా ప‌శ్చిమబెంగాల్‌లో కూడా ఇవే తరహా గుడ్లు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అవన్నీ ప్లాస్టిక్‌ గుడ్లు అని, వాటిని తింటే ఆరోగ్యానికి హానికరమని జోరుగా ప్రచారం జరిగింది. వాటిపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ కోడి గుడ్లు ఉన్నట్లు విచారణలో ఎక్కడా తేలలేదని అప్పట్లో చెప్పిన ఆమె.. నిర్భయంగా గుడ్లు తినవచ్చని స్పష్టం చేశారు.
ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి.ఇప్పుడు అన్నీ క‌ల్తీ మ‌యం కావ‌డంతో ఏవి కొనాలో గంద‌ర‌గోలంలో ప్ర‌జ‌లు ఉన్నారు.ఇప్పుడు జాగ్ర‌త్త‌గా ఉండ‌క‌పోతే క‌ల్తీభారిన ప‌డి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.అందుకే ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి.ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌ అధికారులు ఇప్పుడు పరిశీలించి ఏమని తేలుస్తారో చూడాలి మరి.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -