Monday, May 20, 2024
- Advertisement -

సెక్స్ కోసం ఖైదీల పోరాటం…

- Advertisement -
Distic Womens Fire Nara Lokesh

జైల్ల‌లో మ‌గ్గుతున్న ఖైదీలు కుటుంబాల‌కు దూరంగా మాన‌సిక క్షోభ అనుభ‌విస్తుంటారు. సెక్స్ అనేది ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగం. కానీ ఖైదీలు వాట‌న్నింటికీ దూరంగా ఉండాల్సిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే జైళ్లలో ఖైదీలు అప్పుడప్పుడు తమ డిమాండ్ల కోసం ఉద్యమాలు చేయడం.. నిరసన తెలపడం తెలిసిందే. అయితే… తమను వేధిస్తున్నారనో.. సరైన తిండి పెట్టడం లేదనో విడుదల చేయాలనో.. నిరసన తెలుపుతుంటారు.కానీ బ్రిటన్‌లో ఓ సీనియర్‌మోస్ట్‌ ఖైదీ సెక్స్ కావాల‌ని వింత డిమాండ్‌తో వార్తల్లో నిలిచాడు.

నాటింగ్ హామ్ షైర్ లోని లోథమ్ గ్రేగ్ జైలులో ఖైదీగా ఉన్న జాక్ స్వారేజ్ చాలాకాలంగా శిక్ష అనుభవిస్తున్నాడు. దీంతో ఆయన అక్కడి ఖైదీల మానసిక స్థితిపై అధ్యయనం చేసి సమాజం ఆశించిన మేరకు ఖైదీలలో పరివర్తన రావాలంటే తరచూ శృంగార కార్యకలాపాలకు అనుమతించాల్సిందేనని వాదిస్తున్నాడు. అందుకే ఖైదీలు సెక్స్ డాల్స్ ను వినియోగించుకునేలా చట్టాలు సవరించాలని డిమాండ్ చేస్తున్నాడు.

జాక్‌ స్వారేజ్‌ అనే ఆయన గతంలో తీవ్రనేరానికి పాల్పడి, ప్రస్తుతం నాటింగ్‌హోమ్‌ షైర్‌లోని లోథమ్‌ గ్రేగ్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. చాన్నాళ్లుగా జైలు లోపలి పరిస్థితులను నిశితంగా గమనించిన ఆయన.. సమాజం ఆశించిన మేరకు ఖైదీలలో పరివర్తన రావాలంటే తరచూ శృంగారకార్యకలాపాలకు అనుమతించాల్సిందేనని వాదిస్తున్నాడు. అందుకే ఖైదీలు సెక్స్‌ డాల్స్‌ను వినియోగించుకునేలా చట్టాలు సవరించాలని డిమాండ్‌ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా పైసా ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదని, ఖైదీల సొంత డబ్బుతోనే రబ్బరు బొమ్మల్ని కొనుక్కునే వీలు కల్పించాలని కోరుతున్నాడు.

ఈ మేరకు జైలు వైబ్‌సైట్‌ పేజీలో తన వాదనను వినిపించిన జాక్‌ ను ప్రఖ్యాత బీబీసీ సహా పలు అంతర్జాతీయ చానెళ్లు ఇంటర్వ్యూ చేశాయి. ఆయా ఇంటర్వ్యూలు చూసిన, చదివినవారిలో అత్యధికులు జాక్‌ వాదనతో ఏకీభవించడం గమనార్హం. ’ఖైదీలకు ఈ మాత్రం అవకాశం కల్పించకపోతే మానసికంగా ఇంకా కుంగిపోయే ప్రమాదం ఉంటుంది’అని అంటాడు జాక్‌! కాగా, ఇతని డిమాండ్‌పై బ్రిటన్‌ జైళ్ల శాఖ ప్రస్తుతానికైతే స్పందించలేదు.

Related

  1. ఉప్పు నీటిలోని ఐరన్‌కు గాలి తగలడంతో ఆ ప్రాంతంలోని నీళ్లు ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి
  2. ర‌స‌వ‌త్త‌రంగా మారిన‌ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌
  3. యుద్ధ‌రంగంలోకి ఉత్త‌ర‌కొరియా దిగుతోందా……?
  4. వీసా నిబంధ‌న‌లు మ‌రింత ఖ‌టిన‌త‌రం…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -