Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ కు షాక్.. 2019లో గెలుపు కష్టమేనా..?

- Advertisement -
pulivendula difficult to win the jagan these factors

2019లో విజ‌యం సాధించి అధికారంలోకి రావాల‌ని వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్‌ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏపీలో గెలుపు సంగ‌తి ఏమోగాని జ‌గ‌న్‌కు ఇప్పుడు క‌నీసం సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అయినా పట్టు ఉంటుందా ? అంటే డౌటే అన్న ఆన్స‌ర్ వ‌స్తోంది. గ‌త నాలుగు ద‌శాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీకి తిరుగులేకుండా కంచుకోట‌గా ఉన్న క‌డ‌ప‌లోనే వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి సోద‌రుడు, జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్‌.వివేక 33 ఓట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయారు.

చంద్ర‌బాబు ప‌న్నిన వ్యూహంతోనే ఇక్క‌డ టీడీపీ గెలుసు సుసాధ్య‌మైంది. ప‌ట్టిసీమ ప్రాజెక్టుతో గోదావ‌రి జలాల‌ను కృష్ణాడెల్టాకు త‌ర‌లించిన చంద్ర‌బాబు పైన ఉన్న మిగులు జలాల‌ను గండికోట ద్వారా పులివెందుల‌కు త‌ర‌లించారు. శ్రీశైలం నుంచి న‌వంబ‌ర్‌కే పులివెందుల‌కు నీళ్లు వ‌చ్చేశాయి. దీంతో యెన్నే యేళ్లుగా క‌రువు కోర‌ల్లో చిక్కుకుని విల‌విల్లాడిన పులివెందుల ప్రాంతం కృష్ణా జ‌లాల‌తో కాస్త ప‌చ్చ‌ని రూపు రేఖ‌లు సంత‌రించుకుంది. ఈ ఎఫెక్ట్ వైఎస్ ఫ్యామిలీపై బాగా ప‌డింది. చంద్ర‌బాబుకు ఇది పులివెందుల ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఓ స్థానం ఏర్ప‌రిచింది. ఇక ఇక్క‌డ వ్యూహాత్మ‌కంగా పులివెందుల‌కే చెందిన బీటెక్ ర‌విని టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించారు.

ఇప్పుడు పులివెందుల‌లోనే జ‌గ‌న్‌కు యాంటీగా ఫైట్ చేసేందుకు టీడీపీ నుంచే ఇద్ద‌రు ఎమ్మెల్సీలు ఉన్నారు. స‌తీష్‌రెడ్డితో పాటు బీటెక్ ర‌వి కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ అవ్వ‌డంతో జ‌గ‌న్‌కు ఇద్ద‌రు గ‌ట్టి ప్ర‌త్య‌ర్థులు వ‌చ్చిన‌ట్ల‌య్యింది. జిల్లాలోనే కాదు పులివెందుల‌లో కూడా రోజు రోజుకు వైఎస్ ఫ్యామిలీతో పాటు జ‌గ‌న్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తుండ‌డంతో 2019 జ‌గ‌న్ పులివెందుల‌లో కూడా గెలిచేందుకు చెమ‌టోడ్చ‌క త‌ప్పేలా లేదు. జ‌గ‌న్ 2019లో స్టేట్ వైడ్‌గా కాన్‌సంట్రేష‌న్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్సీలు ఇక్క‌డ బాగా దృష్టి పెడితే ఆ ఎఫెక్ట్ జ‌గ‌న్ గెలుపును త‌ప్ప‌కుండా ప్ర‌భావితం చేసేలా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -