Sunday, May 5, 2024
- Advertisement -

నీతులు ఇత‌రుల‌కేనా… మ‌న‌కు వ‌ర్తించ‌వా..

- Advertisement -
YS Jagan class to YSRCP Santhanuthalapadu MLA Suresh Adimulapu

ఒక‌రికి నీతులు చెప్పేముందు …ఆనీతులు మ‌నం పాటిస్తున్నామ‌నేది ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి. అంతే గాని ఇత‌రుల మీద వేలు ఎత్తి చూపించ‌డం మంచిది కాదు. నాయ‌కుడు పాటిస్తె ..మిగితా వారు దాన్ని అనుస‌రిస్తారు.

ఈ నీతి సూత్రాలు ఏంట‌నుకున్నాక‌రా…! ఎవ‌రి గురించే క‌దా మీ ఆలోచ‌న‌. ఎవ‌రో కాదు వైసీపీ అధినేత జ‌గ‌న్ గురించి ఇంత‌కీ విష‌యం ఏమిటంటారా ..మీరే చ‌ద‌వండి.
నాయకుడు అంటే ముందు ఉంది నడిపించే వాడు. ముందు తాను మారి, తన వారిని, తనను నమ్మిన వారిని సరైన మార్గంలో ముందుకు తీసుకు వెళ్ళేవాడు.నాయకుడు అంటే ప్రజలు హర్షించేలా పరిపాలన చేసి, అది ప్రజా పాలన అనిపించుకునే వాడు. అదే క్రమంలో ఒక పార్టీ అధినాయకుడు అన్నాక పార్టీని పటిష్టంగా నడిపించే బాధ్యత మొత్తం అతని హస్తాలపై ఉంటుంది. పార్టీలో ఉన్న బలాలు, బలహీనతలపై అధినాయకుడు కన్ను ఎప్పుడూ ఉంటుంది. ప్రజలు హర్షించేలా పరిపాలన చేసే వారికి అభినందనలు తెలపడం, ప్రజలు నొచ్చుకునేలా పరిపాలన జరిపే వారిని మందలించడం అతని కర్తవ్యంలో భాగమే.
అస‌లు విష‌యం ఏమిటంటే వైకాపా అధినేత జ‌గ‌న్ ను క‌లుద్దామ‌ని వ‌చ్చిన ఎమ్మెల్యేకు అభివృద్ది గురించి క్లాస్ పీకాడాట. ముందు మ‌నం ప్ర‌జ‌ల‌కు ఎంత‌చేశామ‌నేద‌న్ని అలోచించాలి. అదిలేకుండా ఇత‌రుల‌మీద పెత్త‌నం చెలాయిస్తే ఎవ‌రు ఊరుకుంటారు.

{loadmodule mod_custom,Side Ad 1}

సంతనూతలపాడు నియోజకవర్గం విషయమై జగన్ ఎమ్మెల్యేకు క్లాస్ పీకారని చెబుతున్నారు. జగన్ క్లాస్ పీకడంతో సదరు ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనకు గురయినట్లుగా ప్రచారం సాగుతోంది. అభివృద్ది విషయంలో వెనుకబడి ఉన్నాం అంటూనే అదిగో ఆమెను చూసి నేర్చుకో అంటూ ఒక లేడీ ఎమెల్యేని ఉదాహరణగా చెప్పారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే పని తీరు బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. రోజాను చూసి నేర్చుకోవాలని జగన్ సలహా ఇచ్చారని కూడా ప్రచారం సాగుతోంది. రోజాను చూసి పరిపాలన నేర్చుకో అనడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఈమ‌ధ్య‌నే చూశాం రోజా సొంత‌నియేజ‌క వ‌ర్గంలోనే ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్న విష‌యం జ‌గ‌న్ మ‌ర‌చిపోయిన‌ట్లున్నారు.ప‌రిపాల‌న‌లో గొప్ప నాయ‌కున్ని ఆదర్శంగా తీసుకోమంటే సరే గానీ, మరీ రోజాను ఆదర్శంగా తీసుకోమంటేనే ఆయనకు చిర్రెత్తుకొచ్చిందని నియోజకవర్గంలో టాక్.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -