Saturday, May 18, 2024
- Advertisement -

తాజా సర్వే.. వైసీపీ ఊహించని ప్రభంజనం.. టీడీపీకి ఓటమి ఖాయం

- Advertisement -
YSRCP Win 2019

కొంతకాలంగా దేశంలో కానీ.. రాష్ట్రంలో కానీ.. పార్లమెంటు ఎన్నికల్లో కానీ.. అసెంబ్లీ ఎన్నికల్లో కానీ.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి.. అవతల పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం గురించి ఓన్ గా సర్వేలు చేయించుకోవడం చూస్తునే ఉన్నాం.

గత ఏడు దశాబ్దాల భారతవాణిలో సర్వేల ప్రకారమే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. సర్వేలలో వచ్చిన ఫలితాల కంటే ఒకటి రెండు సీట్లు తేడాతోనే ప్రజలు తమ తీర్పును చెప్పేవారు. అయితే ఇదే నెపథ్యంలో ఏపీ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం పై స్వచ్చంద సంస్థ మరియు తెలుగు మీడియా రంగంలో అగ్రస్థానంలో ఉన్న ఒక ప్రముఖ ఛానల్ అధినేత కల్సి నిర్వహించిన సర్వేలో దిమ్మతిరిగే విషయాలు బయట పడ్డాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అని సర్వే నిర్వహించగా అటు అధికార తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్ళు పరుగెత్తేలా ప్రజలు తమ తీర్పును ప్రకటించారు.

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి అంటే ..? ఆ ఫలితాలు జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు 5 సీట్లు ,ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగు దేశం పార్టీకి 30 సీట్లు ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి 125 సీట్లు ,ఇతరులు 15 సీట్లు గెలుస్తారు అంటూ ఆ సర్వే తేల్చేసింది .సర్వేలో వచ్చిన ఫలితాలను బట్టి వైసీపీ గాలి బాగా వీస్తోంది అని అర్ధమవుతుంది.

తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ఏపీ ప్రజలకు ఏమీ చేయకపోవడంగా తెలుస్తోంది. జగన్ రైతుల కోసం రైతు మహాగర్జన ,యువకుల కోసం యువభేరి, రైతులకు పరామర్శ యాత్రలు అంటూ ఇలా పలు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జగన్ ప్రజలకు దగ్గరయ్యాడు. ఇంకా ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ పోరాడుతున్న తీరుకు ఏపీ ప్రజలు ఫిదా అయ్యారు అని ఈ సర్వేలో తేలింది. ఇదే విధంగా మరో రెండు ఏండ్లు వైసీపీ ఇలాగే ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వం మీద పోరాడితే వైసీపీకి 125 నుండి 140 సీట్లు వచ్చిన ఆశ్చర్యం ఏమి కాదు అని ఈ సర్వే తేల్చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -