Thursday, May 8, 2025
- Advertisement -

ఆఫ్ఘనిస్థాన్ జోరు మొన్న ఇంగ్లండ్..నేడు పాక్

- Advertisement -

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో ఆప్ఘానిస్తాన్ జోరు కొనసాగుతోంది. మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌ను చిత్తు చేసిన ఆప్ఠాన్…సోమవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. భారీ లక్ష్యాన్ని సైతం ఆప్ఘాన్ చేధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

283 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘాన్…8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఒక ఓవర్ మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ 65, ఇబ్రహీం జద్రాన్ 87 పరుగులు చేయగా వీరిద్దరూ ఔటైన తర్వాత మిగితా లక్ష్యాన్ని హస్మతుల్లా షాహిదీ 48 పరుగులు, రహ్మత్‌షా 77 పూర్తి చేశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో పాకిస్థాన్ 7 వికెట్లు కోల్పోయి 282 పరుగులు చేసింది. షఫీక్ 58,బాబర్ అజామ్ 74,షాదాబ్ ఖాన్ 40,ఇఫ్తాకర్ అహ్మద్ 40 పరుగులు చేయడంతో పాక్ భారీ స్కోరు సాధించగలిగింది. ఇబ్రహీంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -