బుల్లితెరపై తన అందాలతో అలరించి.. కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెట్టిన రష్మీ దర్శకధీరుడు రాజమౌళికి పెద్ద షాక్ ఇచ్చింది. బుల్లితెరపై చిట్టిపొట్టి బట్టలతో కుర్రకారును రెచ్చగొట్టి గుంటూర్ టాకీస్ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన రష్మీ యువత గుండెల్లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. అయితే ఈ భామ తాజాగా దర్శకుడు రాజమౌళి పేరు ఊటంకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
రాజమౌళి వంటి పెద్ద డైరెక్టర్ పిలిచిన తాను వెళ్లనని.. జబర్దస్త్ షోను ఎట్టి పరిస్థితుల్లో వదిలి పెట్టేది లేదని ఖరాఖండిగా చెప్పింది రష్మీ. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసిన…. ఎన్నీ పాత్రలు చేసిన… ఎన్ని అందాలు చూపించిన తనకు మాత్రం జబర్ధస్త్ వల్లే ఈ స్థాయి పేరు వచ్చిందని.. కాబట్టి ఎంత పెద్ద ఆఫర్ వచ్చిన జబర్ధస్త్ ను మాత్రం వదిలేది లేదు అని అంటుంది.
చివరకు రాజమౌళి లాంటి దర్శకుడు వచ్చి తనను సినిమాల్లోకి రమ్మని అడిగినా తాను రాజమౌళి ఛాన్సును వదులుకుంటానే తప్ప జబర్దస్త్ షోను మాత్రం వదలనని చెప్పింది. రాజమౌళి సినిమాల్లో బీ గ్రేడ్ రోల్స్ చేసుకునే రష్మీకి చోటు ఉంటుందా…అలాంటి దర్శకుడు పిలిస్తే ఎవరైనా ఛాన్సు వదులుకుంటారా…? రష్మీ మరీ ఓవర్ చేసేస్తోందన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
Related