Saturday, May 10, 2025
- Advertisement -

ఆధార్ కార్డ్ లేనివారికి గుడ్ న్యూస్!

- Advertisement -

ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరి ముఖ్యమైనది. ఆధార్ కార్డు పొందడం మన అందరి హక్కు. ఆధార్ కార్డ్ అనేది పన్నెండు అంకెలు ఉన్న వ్యక్తిగత గుర్తింపు సంఖ్య. ఈ ఆదార్ కార్డ్ ను భారత ప్రభుత్వం తరపున యూనీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ అఫ్ ఇండియా (UIDAI) జారీ చేస్తుంది. భారత దేశంలో ఏ చోట అయిన వ్యక్తిగత గుర్తింపు, చిరునామాలకు ఈ ఆదార్ సంఖ్య పని చేస్తోంది.

అయితే ఇప్పటికి మన దేశంలో ఆధార్ కార్డ్ లేనివారు చాలా మందే ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 106.60 కోట్ల ఆధార్ నంబర్లు నమోదు కాగా.. ఇప్పుడు ఆధార్ కార్డులు లేని వారి కోసం యుఐడీఏఐ దేశవ్యాప్తంగా ఆధార్ నమోదుకు ఈ రోజు నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించింది. ఈ ప్రత్యేక ఆధార్ నమోదు కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించాలని యుఐడీఏఐ నిర్ణయించింది.

ఆధార్ నెం లేనివారు ముందుగా యుఐడీఏఐ వెబ్ సైట్లో రిజిస్టర్చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ప్రాధాన్యత ప్రాతిపదికన వారిని యుఐడీఏఐ అధికారులు సంప్రదించి గుర్తింపు సంఖ్యను నమోదు చేస్తారు. ఆధార్ నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని 18 ఏళ్ల వయసుపైబడిన వారికి మాత్రమే వర్తింపజేస్తారు. UIDAI వెబ్ సైట్ ను సంప్రదించేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి: https://uidai.gov.in/beta/

Related

  1. బ్ర‌హ్మానందం సినిమాల‌కు గుడ్ బై???
  2. న్యూస్ పేపర్ వేస్తూ చదువుకుంటున్న అమ్మాయి!
  3. అమ్మకి ఏమైందో తెలిసింది ..
  4. అమ్మకానికి టీవీ 9

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -