Sunday, April 28, 2024
- Advertisement -

మీరు వాట్సప్ గ్రూప్ లో ఉన్నారా.. అయితే మీకు గుడ్ న్యూస్ !

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్స్ లో అత్యాదిక మంది యూస్ చేసే మెసేజింగ్ యాప్ వాట్సప్. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ వాట్సప్ లో సమయం గడిపేస్తూ ఉంటారు. ఈ మెసేజింగ్ యాప్ ద్వారా అవతలి వ్యక్తికి ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్ లు, వంటి వాటిని ఎంతో సులభతరంగా పంపించే వీలు ఉంటుంది. అందుకే వాట్సప్ ను అత్యధిక మంది యూస్ చేస్తూ ఉంటారు. ఇక ఒకే సారి చాలా మందితో చాట్ చేసుకునేందుకు వాట్సప్ లో గ్రూప్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ గ్రూప్స్ ద్వారా ఏకకాలంలో అందరికీ సమాచారం అందించవచ్చు.

దాంతో గ్రూప్ ఆప్షన్ లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తూ ఉంటుంది వాట్సప్ సంస్థ. మొదట్లో వాట్సప్ గ్రూప్ లో గరిష్టంగా 256 మందికి మాత్రమే అనుమతి ఉండేది. అయితే గ్రూప్స్ యొక్క సభ్యుల పరిమితి పెంచాలని యూజర్స్ నుంచి భారీగా రిక్వస్ట్ లు రావడంతో ఆ తరువాత వాట్సప్ సంస్థ గ్రూప్ సభ్యుల సంఖ్యను 512 ను చేసింది. అయినప్పటికి యూజర్స్ నుంచి అలాగే రిక్వస్ట్ లు వస్తుండడంతో ఈసారి ఏకంగా 1,024 మంది ఒక గ్రూప్ లో ఉండే విధంగా అప్డేట్ చేసింది. దీంతో ఒక వాట్సప్ గ్రూప్ లో అత్యధికంగా 10,24 మందికి సభ్యులుగా అనుమతి ఇవ్వవచ్చు. వాట్సప్ గ్రూప్స్ ఎక్కువగా యూస్ చేసే వారికి ఈ అప్డేట్ నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం బీటా యూజర్స్ కు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. కేవలం గ్రూప్ సభ్యుల సంఖ్యను పెంచడమే కాకుండా గ్రూప్ అడ్మిన్స్ విషయంలో కూడా నయా ఫీచర్స్ ను యాడ్ చేయనుంది వాట్సప్.

Also Read

మొబైల్ నెట్వర్క్ ను 4G నుంచి 5G కి మార్చండిలా !

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

మొబైల్ కు రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా.. జాగ్రత్త !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -