Friday, March 29, 2024
- Advertisement -

అమర్‌ నాథ్‌ యాత్రికులకు గుడ్ న్యూస్

- Advertisement -

అమర్‌ నాథ్‌ యాత్రికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. గత రెండు సంవత్సరాలుగా రద్దైన యాత్ర.. ఈ ఏడాది తిరిగి పునఃప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించి అమర్‌ నాథ్‌ దేవస్థానం బోర్డు .. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రకటించింది. ఈ సంవత్సరం అమర్‌ నాథ్‌ యాత్ర జూన్‌ 30 నుంచి ఆగస్టు 11 వరకు జరగనుంది. ఏప్రిల్‌ 11వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు బ్యాంకుల్లో ఇందుకు సంబంధించిన ఫీజును చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అటు ఆన్‌ లైన్‌తో పాటు యాప్‌ ద్వారా కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చు.

గతేడాది వరకు వంద రూపాయలు ఉన్న రిజిస్ట్రేషన్‌ ఫీజును ఈ సారి 120 రూపాయలకు పెంచారు. గతేడాది బుక్‌ చేసుకున్న యాత్రికులు పెరిగిన రేట్లకు అనుగుణంగా అదనంగా మరో 20 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 13 నుంచి 75 సంవత్సరాల వయసుగల వారిని మాత్రమే అమర్‌ నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. ఇందుకు సంబంధించి మెడికల్‌ సర్టిఫికేట్‌ కూడా అందజేయాల్సి ఉంటుంది. భక్తులకు కల్పించే ఇన్సురెన్సు అమౌంట్‌ ను కూడా పెంచారు. గతేడాది వరకు మూడు లక్షలు ఉన్న ఇన్సురెన్సును ఈ ఏడాది 5 లక్షలకు పెంచారు.

ఈ సారియాత్రకు మూడు లక్షల మంది భక్తులు వస్తారని అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు అంచనా వేస్తోంది. అయితే 2020, 2021లో కరోనా కారణంగా యాత్ర బంద్‌ అయింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన నేపథ్యంలో 2019లోనూ యాత్రను ముగింపు సమయానికి కంటే ముందుగానే బంద్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సారి భారీగానే రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం కనిపిస్తోంది.

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్

ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ అల్టిమేటం

టీఆర్‌ఎస్‌కు పోటీగా బీజేపీ రైతు సభ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -