- Advertisement -

జగన్ మనసులో గంటా శ్రీనివాస్ రావు పార్టీ లోకి రావాలనే ఉందా..?

- Advertisement -

రాష్ట్రంలో గంటా శ్రీనివాస్ రావు గురించి రోజు కో వార్త హల్చల్ చేస్తుంది.. దాంతో ఏపీ రాజకీయం చుట్టూ అయన చుట్టే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అయన పార్టీ మారుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజకీయ విశ్లేషకులు ఫోకస్ అంతా ఆయనపై పెట్టారు. కానీ ఈ అంశాన్ని గంటా ఎప్పటికప్పుడు పొడిగించడంతో అందరు ఎదో విషయం తేల్చాలని పట్టుపట్టారు.. ఆ కోవలోనే అయన వైసీపీ లోకి వెళ్లాలని ఆసక్తి చూపగా ఆ పార్టీ వారు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించారు..

ముఖ్యంగా విశాఖ నేతలైన అవంతి శ్రీనివాస్, విజయ సాయి రెడ్డి లాంటి వారు గంట వస్తే ఆ ప్రాంతపు రాజకీయాలపై తమకు పట్టు పోతుందని చెప్పో గంట రాకను తీవ్రంగా వ్యతిరేకించారు.. జగన్ ఓ సమయంలో గంటా ను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నా వీరి బలవంతం తో అయన తన మనసు మార్చుకున్నారని అంటున్నారు.. ఇక బీజేపీ లోకి వెళదామని గంటా ఆలోచించినా అక్కడ సోము వీర్రాజు ఇప్పటికే వెళ్లిన టీడీపీ లీడర్ల పాత్ర ను నామమాత్రం చేశారు. వారికీ పార్టీ లో ఎలాంటి అధికారం లేకుండా చేస్తూ ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేశారు.. దాంతో అక్కడికి వెళ్లడం ఇష్టం లేక గంటా టీడీపీ లోనే ఉండిపోయారు..

ఇక గంట ఎక్కడికి వెళ్ళరు అనుకుంటున్నా సమయంలో  గంటా తనయుడు రవితేజ వైఎస్సార్పీపీలో చేరతారని, గంటా కూడా వాసుపల్లి గణేష్ బాటలో జగన్ కి జై కొడతారని మీడియా ఊదరగొట్టింది. కానీ ఈసారి ముహూర్తం కూడా ముగిసిపోయింది. కానీ ఎటువంటి మార్పులు లేవు. దానికి అనేక కారణాలున్నట్టుగా చెబుతోంది. ముఖ్యంగా అధికారపక్షంలో చేరాలని గంటా తీవ్రంగా తహతహలాడుతున్నట్టు అంతా భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట కూడా జగన్ మీద విమర్శలకు ఆయన పూనుకోవడం లేదు. అంతేగాకుండా టీడీపీకి దూరంగా ఉంటున్నారు. తద్వారా తాను వైఎస్సార్సీపీకి చేరువయ్యేయత్నంలో ఉన్నాననే సంకేతాలు పంపిస్తున్నారు. అయితే జగన్ గంటా ని ఆలోచించడానికి ఓ కారణం ఉంది.. గంటా పార్టీలో మారితే టీడీపీకి తీరని నష్టం జరుగుతుంది దీన్ని పరిగణలోకి తీసుకుని జగన్ గంటా గురించి మరొక సారి ఆలోచిస్తున్నాడట..  

వైసీపీలోకి గంటా.. వెంటనే ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..!

వారి కొసం జగన్ వ్యూహం ఎంటి..?

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

సబ్బం హరికి ఇప్పుడు బుద్ధి వచ్చిందా.. ఏం లాభం అయిపోయాకా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -