Friday, April 19, 2024
- Advertisement -

ఉప్పెన, రెడ్ సినిమా లు ఇంతలా భయపడుతున్నాయేంటి..?

- Advertisement -

దసరా సీజన్ అంటే సినిమా ప్రియులకు పెద్ద పంగదా ఎందుకంటే ఈ సీజన్ లో సూపర్ స్టార్ హీరో లు తమ సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు.. అలాగే ఈ సీజన్ అచ్చోచ్చిన హీరోలు సైతం ఈ సీజన్ లో మాత్రమే సినిమాలు రిలీజ్ చేసి పండుగ రోజును కాష్ చేసుకుంటారు కూడా.. కానీ ఈ సంవత్సరం దసరా సీజన్ చాలామంది హీరోలకు చేదు అయిపోయిందని చెప్పాలి.. కారణం కరోనా వల్ల సినిమా థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు..

అయితే ఇంకో పది రోజుల్లో 50 శాతం కెపాసిటీతో తెరుచుకోబోతున్నాయి కానీ ఏ కొత్త సినిమాలు వస్తాయనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. చిన్న నిర్మాతలు కూడా ప్రయోగాత్మకంగా తమ చిత్రాలను విడుదల చేసేందుకు అంత సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఇంకా కరోనా వ్యాప్తి ఉన్న దృష్ట్యా అనుమతులు రావడం అనుమానమేనని ఇన్ సైడ్ టాక్. ఎప్పటినుంచో రిలీజ్ నోచుకుని సినిమాలు రిలీజ్ అవుతాయి అని ప్రేక్షకులు ఎదురుచూశారు.. ఉప్పెన, రెడ్, మాస్టర్ సినిమాలు దసరా కి రిలీజ్ అవుతాయి అనుకున్నారు..

కానీ ఈ యూనిట్ లు కూడా ససేమీరా ఈ దసరా కి రిలీజ్ చేయమని తేల్చి చెపుతున్నారట.. తెలుగులోనే కాదు తమిళంలోనూ విజయ్ మాస్టర్ ని రిలీజ్ చేసేందుకు ప్రొడ్యూసర్లు నో అంటున్నారు. ఈ లెక్కన 15వ తారీఖు నుంచి సినిమా హాళ్ళలో పాత సినిమాలు వేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. అయితే చాలా సినిమాలు క్రిస్మస్ ని టార్గెట్ చేసుకుంటుండడం విశేషం.. అప్పటివరకు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి అలవాటుపడతారు.. అప్పుడు రిలీజ్ చేస్తే ఎంతో కొంత డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.. కీలకమైన రెండు పండగలు కరోనా వల్ల వృధాగా పోయే దుస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. పోనీ ఎవరైనా ధైర్యం చేసి కాస్త ఇమేజ్ ని హీరో మూవీని వదిలే ఆలోచన చేస్తే అనుకూల ఫలితం వస్తుందేమో. ఆ ధైర్యం ఎవరు చేస్తారో చూడాలి..

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

OTT లకు సంక్షోభం.. అన్ని ఫ్లాప్ సినిమాలే.. సూర్య..?

దసరా కి ఎన్టీఆర్ టీజర్.. ప్లాన్ చేస్తున్న జక్కన్న..?

దీనికి కూడా ప్రభాస్ ముందు పడాలట..దాన్ని చూసి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -