అమెరికా ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్.. అతిబలహీనమైన అధ్యక్షుడని అన్నారు చైనా ప్రభుత్వ సలహాదారు జెంగ్ యోంగ్ నియన్. బైడెన్ అధికారం చేపట్టాక తమ దేశంతో యుద్ధానికి దిగవచ్చని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధమవ్వాలని వ్యాఖ్యానించారు. అమెరికాతో అనుబంధం పెంచుకోవడానికి దొరికిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.
అమెరికన్ కాంగ్రెస్లో చైనాకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు, డెమొక్రాట్లు 300లకు పైగా బిల్లులను ప్రవేశపెట్టారు. హాంకాంగ్, షిన్జియాంగ్లో అలజడులను పరిష్కరించేందుకు తీసుకువచ్చిన హాంకాంగ్ మానవహక్కుల, ప్రజాస్వామ్య చట్టానికి ఇరు పక్షాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో.. బైడెన్ హయాంలోనూ చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతాయని చైనా విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ టాప్ విలన్ల రెమ్యునరేషన్ ఎంతంటే..?
వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!