సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ సినిమాలు అంటేనే ఓ వైవిధ్యం ఉంటుంది. ఇతర దర్శకుల సినిమాలతో పోలిస్తే.. ఆయన సినిమాలు విభిన్నంగా ఉండటమే కాకుండా ఎనర్జిట్‌గా ఉంటాయి. పూరీ నుంచి ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో దానికి తగినట్టుగానే ఆయన సినిమాలు ఉంటాయి. ఇటీవలే హీరో రామ్‌తో ఇస్మార్ట్ శంకర్ అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం లైగర్. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, లైగర్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తన అందాలతో దుమ్ము లేపనుందని సమాచారం. ఈ హాట్ భామ అందాలను వెండితెరపై ఫుల్‌గా చూపించడానికి ప్రత్యేకంగా పాత్రలు డిజైన్ చేశారంట పూరీ. అలాగే, విజయ్, అనన్యల మధ్య ఘాటెక్కించే రోమాన్స్ సీన్లు ఉండనున్నాయట. ఈ మూవీలో ముఖ్యంగా భారీ యాక్షన్ సీన్లు, మత్తెక్కించే రోమాన్స్ ఉండబోతుందట.. చూడాలి మరి పూరీ ఏ రేంజిలో అనన్య విజయ్‌ల రోమన్స్ పండిస్తారో..!
హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’
త్వరలోనే వెండితెరపై నాగార్జున బ్రహ్మస్త్ర
కీచక ప్రిన్సిపల్ కు ఉరిశిక్ష.. సహకరించిన టీచర్ కు జీవిత ఖైది!