Monday, May 6, 2024
- Advertisement -

కోటి వృక్షార్చన మొదలైనట్టే.. మొదట ఎవరంటే..!

- Advertisement -

రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ స్వగ్రామంలో కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని కొదురుపాకలో వేయి మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందస్తుగా నిర్వహించారు. నాలుగు లైన్ల వంతెన సమీపంలో తెరాస నాయకుడు జోగినపల్లి రవీందర్ రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ట్రీగార్డులు ఏర్పాటు చేశారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దుతున్న సీఎం కృషికి మద్దతుగా ఈ నెల 17న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఇప్పటికే ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో ఎంతో మంది సెలబ్రెటీలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కి మంచి ఆదరణ కూడా లభించింది. సినీ, క్రీడా,రాజకీయ రంగాల్లో వారు ఇందులో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

హైదరాబాద్ లో అల్లు అర్జున్ ’పుష్ప’

రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు.. ఆదేశాలు జారీ..!

మెంతులు తో ఆరోగ్యానికి కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -