Thursday, April 25, 2024
- Advertisement -

కీచ‌క ప్రిన్సిప‌ల్ కు ఉరిశిక్ష‌.. స‌హ‌క‌రించిన టీచ‌ర్ కు జీవిత ఖైది!

- Advertisement -

ఆడ పిల్ల‌ల‌మీద జ‌రుగుతున్న అగాయిత్యాలు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. ఏ పాపం తెలియ‌ని చిన్నారుల‌ను సైతం కామాందులు చిదిమేస్తున్నారు. ఇలాంటి ముర్ఖుల ఆగ‌డాలు ఆగాలంటే మ‌న చ‌ట్టాల‌ను ప‌టిష్టం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎంతో మంది చెబుతుంటారు. అయితే ఇలాంటి కేసు విష‌యంలో ఒక కోర్టుతీసుకున్న నిర్ణ‌యానికి ఇప్పుడు అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక వివ‌రాల్లోకి పోతే.. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోకి పుల్వారీ ష‌రీప్ ప్రాంతంలో ఒక పాఠ‌శాల ఉంది. అందులో 11 ఏళ్ల చిన్నారి 5వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఆ పాఠ‌శాల‌లో అర‌వింద్ కుమార్ అనే వ్య‌క్తి ప్రిన్సిప‌ల్. అభిషేక్ కుమార్ అనే వ్య‌క్తి టీచ‌ర్. అయితే ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ ఆ చిట్టిత‌ల్ల‌పై 2018 సెప్టెంబర్ లో అత్యాచారం చేశాడు. ఆ చిట్టిత‌ల్లిని బెదిరిస్తూ పలుమార్లు ఈ ఘాతుకానికి పూనుకున్నాడు.

ప్రిన్సిప‌ల్ చేసే ఈ దుశ్చర్యకు.. టీచర్‌గా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ కూడా స‌హ‌క‌రించాడు. కొన్న రోజుల తర్వాత ఆ చిట్టితల్లి అనారోగ్యానికి గురి కావ‌డంతో త‌ల్లిదండ్రులు హాస్పిట‌ల్ కు తీసుకుపోయారు. అక్కడ ఆ చిన్నారిని ప‌రిక్షీంచ‌గా త‌ను గ‌ర్భ‌వ‌తి అని తేలింది. దాంతో విష‌యం తెలుసుకున్న త‌ల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు.

పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రిన్సిప‌ల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. ఆ కేసుకు సంబంధించి పాట్నా కోర్టు ఇప్పుడు ప్రిన్సిపల్‌కు మరణశిక్షను విధించింది. అలాగే ఒక ల‌క్ష‌ రూపాయల‌ ఫైన్ వేసింది. ప్రిన్సిప‌ల్‌కు సహకరించిన టీచ‌ర్ కు జీవిత ఖైది శిక్ష‌ను వేసింది. అలాగే రూ. 50,000 జరిమానా విధించింది.

అనసూయను అవ‌స‌రానికి వాడుకున్నారట !

మ‌ళ్లీ ఒక‌టిగా క‌నిపించ‌నున్న షారుఖ్, స‌ల్మాన్ !

స్పై ‘ఏజెంట్ వినోద్’గా కళ్యాణ్ రామ్ !

చికెన్ తెచ్చినందుకు రూ. 10 వేల జ‌రిమానా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -