కేజీఎఫ్ సినిమా సృష్టించిన రచ్చ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఘనత ఈ చిత్రానిదే.ఈ ఒక్క సినిమాతోనే కన్నడ హీరో యశ్ పాన్ ఇండియా స్టార్‌గా అయిపోయాడు అనడంలో సందేహం లేదు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 గురించి ఇంకా చెప్పకూడదేమో..?
దానికున్న క్రేజ్ అలాంటిది. విడుదల కాకముందే భారీ రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ఇప్పుడు అన్ని భాషల మూవీ లవర్స్ వేచి చూస్తున్నారు. అంచనాలకు తగ్గట్టుగానే అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి భారీగా బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలు చెప్తున్న ధరలు విని బయ్యర్లకు వణికి పోతున్నారట.
ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారని టాక్. వీటితో పాటు పలు భాషల రైట్స్‌కు కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేజీఎఫ్ కేజీఎఫ్ చాప్టర్ 2 తెలుగు హక్కులను నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.దీని కోసం దిల్ రాజు రూ.65 కోట్ల వెచ్చించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
15యేళ్ల తర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ!
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలుగు యువతి !