మెగా ఫ్యామిలీ నుంచి వెండితెరకు పరిచయమైన నూతన నటుడు వైష్ణవ్ తేజ్ మంచి ఊపులో కనిపిస్తున్నాడు. సినీ అరంగేట్రం చేసిన మొదటి సినిమా ఉప్పెన తో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిని ఈ హీరో తెగ ఆనందంలో ఉన్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతోంది. కలెక్షన్లు సైతం భారీగా రాబడుతోంది. ఈ సినిమాతో ఒక్కసారిగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబులకు మంచి పేరు సంపాదించిపెట్టింది.

ఈ సినిమా హీరో, హీరోయిన్, దర్శకులకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఉప్పెనలా ఉప్పొంగిపోతున్న ఉప్పెన చిత్రం యూనిట్ ఆదే ఆనందంలో కాలినడకన తిరుమల కొండ ఎక్కింది. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుంది. తిరుమలకు వెళ్లిన వారిలో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబా ఇతర చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.

హీరో, హీరోయిన్లు కలినడకనే తిరుమల కొండెక్కడం విశేషం. దీనిని సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు మీడియాతో మాట్లాడుతూ… సినిమాను ఆదరించిన అందరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఉప్పెన స్క్రిప్ట్ ను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు పొందామనీ, అందుకే ఈ చిత్రం ఈ స్థయిలో ఘన విజయం సాధించిందని తెలిపారు. నెక్స్ట్ తీయబోయే చిత్రం స్క్రిప్ట్ ను కూడా శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నామని తెలిపారు.
షాదీ ముబారక్ అంటున్న దిల్ రాజు !
‘అన్నాతే’ షూటింగ్ లో సూపర్ స్టార్ రజినీ