పాపం నిహారిక.. ఆశలు వదిలేసుకుందా…??

Niharika Stopped trails for her next movie

మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోయిన్స్ వచ్చి మంచి సక్సెస్ అయ్యారు. అయితే హీరోలు సక్సెస్ అయినా.. హీరోయిన్ గా నిహారిక సక్సెస్ కాలేకపోయింది. మెగా ఫ్యామిలీ లో ఎవరికి ఇష్టం ఉన్న లేకపోయిన నిహారిక కొణిదెల తనకు నటనపై ఇష్టంతో హీరోయిన్ అయ్యింది. అయితే తొలి చిత్రంతోనే రాంగ్‌ స్టెప్‌ వేసింది. ఒక మనసు లాంటి స్టోరీని ఎంచుకొవడంలో ఆమె ప్లాప్ అయ్యింది.  దాంతో మళ్లీ స్టెప్‌ తీసుకునే ధైర్యం చేయలేకపోతోంది.

అసలే మెగా ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కావడంతో సగటు హీరోయిన్‌ పాత్రలతో ఆమెని అప్రోచ్‌ అవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మొదటి సినిమా ఫ్లాప్‌తో మళ్లీ సినిమా అంటే భయపడుతోన్న నిహారికని ఆ దిశగా మెగా ఫ్యామిలీ కూడా ప్రోత్సహించడం లేదు. తనంతట తానుగా నటిస్తానంటూ చెబితే ఎవరూ అడ్డు చెప్పలేరు కానీ, పనిగట్టుకుని ఇప్పుడు తనని హీరోయిన్‌గా నిలబెట్టాలని ఎవరనుకుంటారు? సినిమా ఫ్లాప్‌ అయిన తర్వాత చాలా కాలం మీడియా ముందుకి కూడా రానంతగా హర్ట్‌ అయిన నిహారిక బహుశా మళ్లీ ఆ ప్రయత్నం చేయాలంటే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ బిల్డ్‌ అవ్వాలేమో.

అందుకే యాక్టింగ్‌ పట్ల తనకున్న మక్కువని తీర్చుకోవడానికి నిహారిక వెబ్‌ సిరీస్‌లతో కాలక్షేపం చేస్తోంది. యూట్యూబ్ లో ఫ్రీగా చూడ్డానికి అయితే ఆమె చేస్తోన్న ప్రయత్నాలని తీరిక వేళల్లో చూడ్డానికి ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. ఆ పొగడ్తలు చాలనుకుని వెండితెరపై ఆశలు వదిలేసుకున్నట్టే కనిపిస్తోంది. తెలుసు చిత్రల వరకు వరకు స్టార్‌ ఫ్యామిలీస్‌కి చెందిన అమ్మాయిలకి నటన పరంగా కెరియర్‌ కరక్ట్‌ కాదని మరోసారి రుజువైంది.

Related

  1. 15 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్‌…!
  2. మెగాస్టార్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్!
  3. మెగాస్టార్ కు ఇంతకన్నా రికార్డు మరోటి లేదు..!
  4. అప్పుడే.. ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!