Tuesday, May 21, 2024
- Advertisement -

మహేశ్ బాబు పై కోర్టు కేసు నమోదు.. ఏం జరిగింది…?

- Advertisement -
Srimanthudu Movie Team faces Nampally Court Notice

మహేష్ బాబు హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. ఈ సినిమా రిలీజ్ అయిన చాలా తక్కువ టైంలోనే తనదైన మార్కుతో టాలీవుడ్ రికార్డులను తిరగరాసి… కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది. అంతటి సూపర్ హిట్ అయిన ఈ సినిమాకి కూడా కష్టాలు తప్పేట్టులేవు.

శ్రీమంతుడు సినిమాకి పనిచేసిన దర్శక నిర్మాతలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీచేసింది. అసలు సంగతిలోకి వెళ్తే.. శ్రీమంతుడు సినిమా స్టోరీ తాను రచించిన ప్రేమ నవలను ఆధారంగా చేసుకుని సినిమా తీసారని రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కాగా ఒక వారపత్రికలో 2012లో తాను రాసిన సీరియల్ నే కాపీ కొట్టి సినిమా తీశారన్నది అతగాడి ఆరోపణ. తాను రాసిన ‘‘చచ్చేంత ప్రేమ’’ సీరియస్ లో కాపీ చేశారని.. తనకు న్యాయం చేయాలని ఆయన కోర్టును కోరారు.

రచయిత చేసిన ఫిర్యాదును పరిశీలించిన నాంపల్లి కోర్టు తాజాగా సినిమా హీరో మహేశ్ బాబుకు..చిత్ర దర్శకుడు కొరటాల శివ..ఏర్నేని నవీన్ లను కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రచయిత చేసిన ప్రైవేటు ఫిర్యాదుతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120బీ.. కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్ 63 కింద కోర్టు కేసు నమోదు చేసి.. శ్రీమంతుడు అండ్ కోలను కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది.

Related

  1. 2016లో ప‌వ‌న్, మ‌హేష్‌ లకు ఘోర అవ‌మానం
  2. మ‌హిళ‌ల్లో సెక్స్ కోర్కెలు పెంచే టిప్స్‌
  3. ప‌వ‌న్‌, మ‌హేష్‌ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ బ‌న్నీ!
  4. పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -