మళ్లీ పవన్ ఫ్యాన్స్.. బన్నీ ఫ్యాన్స్ మధ్య.. పెద్ద గొడవ.. ఏం జరిగింది..?

shock to allu arjun from pawan kalyan fans

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కి ప‌వ‌న్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మధ్య కొన్ని రోజుల క్రింద సోష‌ల్ మీడియా సాక్షిగా ర‌భ‌స జ‌రిగిన విష‌యం తెలిసిందే. పవర్ స్టార్ గురించి మాట్లాడమని పవన్ ఫ్యాన్స్ బన్నీ ని అడిగితే నేను మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్‌.. అన్న పాపానికి బన్నీ పై పవన్ ఫ్యాన్స్ ఓ రెంజ్ లో సెటైర్లు విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ తరువాత అల్లు అర్జున మళ్లీ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ప్ర‌త్యేకంగా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సివ‌చ్చింది. ఏదైన వేడుక జరుగుతున్నప్పుడు ప‌వ‌ర్ స్టార్‌.. ప‌వ‌ర్ స్టార్ అని అర‌వ‌కండి అని పవన్ ఫ్యాన్స్ ని వేడుకొన్నాడు బ‌న్నీ.

ఆ వివరణ వల్ల పవన్ ఫ్యాన్స్ సంతృప్తి ప‌డ‌తారేమో అనుకున్నారు అంతా. కానీ అల్లు అర్జున్ కి మళ్లీ షాక్ తప్పలేదు. ఇటివలే ఖైదీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించారు. పవర్ స్టార్.. పవర్ స్టార్ అని అర‌చి గోల గోల చేశారు. దాంతో బ‌న్నీ కాస్త అస‌హ‌నానికి గురైయాడు. పవన్ గురించి బన్నీ మాట్లాడకపోయేసరి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏ మాత్రం ఆగ‌లేదు. దాంతో బన్నీ అక్కడ నుంచి తొందరగా వెళ్లిపోయాడు. అయితే మళ్లీ బన్నీకి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి తలనొప్పి ఎదురైయ్యింది. ఇటివలే పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ గురించి పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుకున్నారు.

అంతే కాకుండా సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ హీరోలు ఈ టీజర్ గురించి పాజిట్వ్ గా మాట్లాడి షేర్ కూడా చేసారు. కాని అల్లు అర్జున్ మాత్రం ఈ టీజర్ గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదట. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బన్నీ పై నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. దాంతో బన్నీ ఫ్యాన్స్ కూడా పవన్ గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. మళ్లీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ సెగ మొద‌లైంద‌న్న‌మాట‌.

Related

  1. నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?
  2. పవన్ కి ఫోన్ చేసిన చిరు.. ఎందుకంటే..?
  3. పవన్, జగన్ కలవనున్నారా..?
  4. బాహుబలికి షాక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌!