Tuesday, April 30, 2024
- Advertisement -

నానికి పవన్ లవర్ కి లింక్ ఏంటి..?

- Advertisement -
bhumika re entry as nanis sister

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుష సినిమాలో భూమిక పవన్ కు లవర్ గా నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఎలాంటి విజయం దక్కించుకుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. తర్వాత భూమిక ఒక్కడు, సింహాద్రి, మిస్సమ్మ వంటి సినిమాలతో ఆకట్టుకుంది.

యోగా గురు భరత్ ఠాగూర్ ని పెళ్లి తర్వాత అనసూయ వంటి సినిమాలో మంచి నటన కనబరిచింది. ఇలా తెలుగు తమిళం, హిందీ భాషల్లో బిజీ నటిగా కొనసాగింది. మూడేళ్ళ క్రితం భూమిక తల్లి కావడంతో సినిమాలకు దూరమయింది. ఇక గత ఏడాది ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ సినిమాలో ధోనీ అక్క పాత్రలో నటించింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ తెలుగులో భూమికకు మంచి అవకాశం వచ్చింది. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని “నేను లోకల్” తో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.

ఇక ఇప్పుడు నాని వేణు శ్రీరాం దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇందులో హీరో అక్క పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంది. అందుకే ఆ క్యారక్టర్ లో నటించమని భూమికను కోరగా ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో లడ్డుబాబు సినిమాలో చివరగా కనిపించిన భూమిక మళ్ళీ నాని సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భూమికకు ఎంతవరకు పేరు తీసుకొస్తుందో చూడాలి.

{youtube}CPVEhUPrgKw{/youtube}

Related

  1. నాని హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్న వ‌రుణ్‌తేజ్‌
  2. పెళ్లయిన అమ్మాయి వెంట పడుతున్న నాని!
  3. నాని కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడంటే?
  4. నాని రేటు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -