- Advertisement -

ప్రైవేట్ ఆసుపత్రి అరాచకం… రూ.2లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని డిమాండ్!

- Advertisement -

ఓ వైపు కరోనా వైరస్ తో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే.. మరోవైపు కొంత మంది కేటుగాళ్లు ఇదే అదునుగా అమాయకుల వద్ద అడ్డగోలిగా డబ్బులు లాగుతున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద ఇదే తంతు నడుస్తుంది. అంబులెన్స్, ఆక్సీజన్ సిండర్లు, కరోనా రోగులను కాల్చే వద్ద చివరికి టీకాలు బ్లాక్ లో అమ్ముతూ రోగులును రోగి బంధువులను ఘోరంగా దోచుకుంటున్నారు.

చనిపోయిన వారి డెడ్‌బాడీలు అప్పగించకుండా మరింత డబ్బులు కట్టాలంటూ వేధింపులకు పాల్పడుతున్నాయి. ఇటీవల బేగంపేటలో బిల్లు కట్టలేదని ఓ హాస్పిటల్ యాజమాన్యం కరోనా రోగిని ఆస్పత్రిలోనే బంధించిన ఘటన మరువకముందే కాప్రాలో లైఫ్ లైన్ హాస్పిటల్‌ సిబ్బంది అదే తరహాలో వ్యవహరించారు.

మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని రాంపల్లి కి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నిరుడు వాసు ఐదు రోజుల క్రితం కరోనా బారిన పడి కాప్రాలోని లైఫ్ లైన్ హాస్పిటల్‌లో చేరాడు. ఈ సమయంలో లక్షన్నర వరకు రోగి బంధువుల ఆసుపత్రి యాజమాన్యానికి అప్పగించారు. వాసు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు.

అయితే మరో రూ.2లక్షలు కడితేనే మృతదేహాన్ని అప్పగిస్తామని హాస్పిటల్ యాజమాన్యం చెప్పడంతో కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. మున్సిపల్ వాసులు అందరు తరలి వస్తుండడంతో కొద్ది సేపట్లో ఆసుపత్రి వద్ద ధర్నా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయి : షర్మిల

పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్

దృశ్యం సినిమా తలపించేలా హత్య..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -