Monday, April 29, 2024
- Advertisement -

మహిళా ఉద్యమాలే కేసీఆర్ కు బుద్ధి చెబుతాయి : షర్మిల

- Advertisement -

తెలంగాణ లో పుట్టి పెరిగాను.. తెలంగాణ కోడలిని అంటూ రాజన్న బాటలో రాజకీయాల్లోకి తొలి అడుగు వేస్తున్నానని వైఎస్ షర్మిల అన్నారు. రాజన్న సంక్షేమ పాలన తిరిగి తేవాలని సంక్పలిస్తున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి నా తొలి అడుగు వేస్తాన్నానంటూ షర్మిల పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీ పెట్టబోతున్నానని అన్నారు. రాజన్నపాలన తిరిగి తేవాలని సంకల్పిస్తున్నానని స్పష్టం చేశారు. తెలంగాణలో నిరుద్యోగుల గురించి ఈ మద్య ఇందిరా పార్క్ వద్ద నిరాహార దీక్ష చేశారు. ఆ దీక్ష భగ్నం చేయడంతో లోటస్ పాంట్ లోనే తన 72 గంటల నిరాహార దీక్ష చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల. తాజాగా మరోసారి సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసుకొని పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క దీక్ష చేపట్టగా, పోలీసులు భగ్నం చేశారు. దీనిపై స్పందించిన షర్మల కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరాహార దీక్ష చేస్తున్న సీతక్కకు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారని ఆమెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. అయితే ప్రశ్నించడమే నచ్చని పెద్దమనిషి కేసీఆర్ కు ఒక మహిళ పోరాటం చేస్తుంటే నచ్చుతుందా? ప్రశ్నించే గొంతుకలను మట్టుబెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల పేర్కొన్నారు.

పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్

BREAKING : చీటింగ్ కేసులో.. నటి, యాంకర్ శ్యామల అరెస్ట్..!

దృశ్యం సినిమా తలపించేలా హత్య..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -