Thursday, April 25, 2024
- Advertisement -

పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్

- Advertisement -

కరోనా వైరస్ విలయతాండవం చేస్తుండడంతో కొందరు మానసికంగా కుంగిపోతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరతతో పాటు ఆక్సిజన్ అందక కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కరోనా టైమ్ లో వైద్య సిబ్బందే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. కరోనా సమయంలో పారిశుద్య, పోలీసులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు.

ఇలాంటి సమయంలో కొన్ని సార్లు వీరు పనివత్తిడి వల్ల సహనం కోల్పోతూ పలు సందర్భాల్లో సీరియస్ అవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా వైద్యుడు, నర్సు మధ్య వాగ్వాదం పెరగడంతో విచక్షణ కోల్పోయిన నర్సు వైద్యుడుపై దాడి చేసిన యుపిలో జరిగింది. వెంటనే వైద్యుడు నర్సుపై చేయి చేసుకోవడంతో పోలీసులు కొంచెం సేపు ఆపారు.

ఇదంతా పోలీసులు, సిబ్బంది ముందే జరగడంతో ఇరువురికీ సర్ది చెప్పారు. నగర మెజిస్ట్రేట్ రాంజీ మిశ్రా ఇద్దరుతో మాట్లాడారు. పని భారంతో పాటు తీవ్రమైన ఒత్తిడితో గొడవ జరిగిందని మెజిస్ట్రేట్‌తో తెలిపారు. ఓ రోగికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం జారీ అంశమై వారు గొడవప‌డ్డ‌ట్టు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -