- Advertisement -

‘తెర కోసం వేషాలు’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

- Advertisement -

ఈ మద్య వెండితెరపై చిన్న సినిమాల జోరు ఎక్కువైంది. భారీ బడ్జెట్ చిత్రాలు సంవత్సరానికి మహా అంటే రెండు మూడు మాత్రమే వస్తున్నాయి. అయితే చిన్న సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకొని పైసా వసూల్ అంటున్నాయి. తాజాగా “V” ప్రొడక్షన్ హౌస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో, మనోజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తెర కోసం వేషాలు’. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది సినిమా టీం.

ఈ సందర్భంగా నిర్మాత శ్రీను సునీల్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథ చాలా బాగుందని.. అందుకే షూటింగ్ వెంటనే మొదలు పెట్టామని, త్వరగానే షూటింగ్ పూర్తి చేసుకున్నామని అన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర కథ విషయానికి వస్తే.. సినీరంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే మా సినిమా కథ.

ఆ యువకులకి కరోనా ఎలాంటి సమస్యలు తెచ్చింది, వాళ్ళు వాటిని ఎలా ఎదురుకున్నారో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అన్నారు. ఈ వారంలో ప్రొమోషనల్ సాంగ్ ని విడుదల చేస్తాము. ఆ వెంటనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తాం .మా టీం కి ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అని నిర్మాత అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ కి అత్తగా బాలీవుడ్ బ్యూటీ!

కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కు ప్రమాదం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -