కరోనా పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష..

- Advertisement -

తెలంగాణలో ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. దాంతో కొన్ని రోజుల పాటు నైట్ కర్ఫ్యూ అమలు చేశారు. అయినా కూడా కరోనా కేసులు మరింతగా పెరిగిపోవడంతో ఈ నెల 12 నుంచి లాక్ డౌన్ ప్రకటించింది టీ సర్కార్. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలించి.. తర్వాత లాక్ డౌన్ పై కఠిన ఆంక్షలు జారీ చేసింది.

తాజాగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 పరిస్థితులపై సిఎం కెసిఆర్ సమీక్ష సోమవారం నిర్వహించారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి సిఎస్ సోమేశ్ కుమార్ తో పాటు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్, బెడ్లు, వెంటిలేటర్ల లభ్యతపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

కరోనా రోగులకు చికిత్స, ఔషధాలు, బ్లాక్ ఫంగస్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కు ప్రమాదం..

ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

ఆకట్టుకుంటున్న‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -