Saturday, April 27, 2024
- Advertisement -

ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కు ప్రమాదం..

- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు ప్రఖ్యాత‌లు సంపాందించుకున్న ప్రియాంక చోప్రా 2018లో అమెరికన్ పాప్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని లాస్ ఏంజెల్స్‌లో సెటిల్ అయింది. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌లో ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో ఆయ‌న‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే గాయాలు పెద్ద‌వేమి కాక‌పోవ‌డంతో డాక్ట‌ర్స్ చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌లో పాల్గొన‌నున్నాడు.

అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు. ఇదిలా ఉంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో భారత్ కు సహాయం చేయడం కోసం ప్రియాంక, నిక్ జోనాస్ ఇటీవల విరాళాలు సేకరించారు. కరోనా బారిన పడి ప్రస్తుతం ఆక్సిజన్, టీకా ఉవసరం ఉన్నవారికి నిధుల సేకరణ కోసం వారిద్దరూ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ వీరు 1 మిలియన్ డబ్బు సేకరించారు.

ప్రియాంక చోప్రా 2018లో వివాహం చేసుకోగా, ప్రియాంక క‌న్నా నిక్ 10 సంవ‌త్స‌రాల చిన్న‌వాడ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల ప్రియాంక చోప్రా త‌న ఆటోబయోగ్రఫీ ‘అన్‌ఫినిష్డ్’ పుస్త‌కాన్ని రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

మార్కెట్‌లో విడుద‌లైన వారంలోపే ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో చేరి.. లెక్కలేనన్ని కాపీలు అమ్ముడుపోయింది. నిక్ జోనాస్ ఇటీవల తన స్టూడియో ఆల్పమ్ స్పే్స్ మాన్ ను విడుదల చేశాడు. అలాగే జుమాన్జీ, వెల్ కమ్ టు ది జంగిల్, మిడ్ వే, ఖోస్ వాకింగ్ సినిమాల్లోనూ నటించారు.

టాలీవుడ్‌ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?

క‌రోనాతో కోలీవుడ్ నటుడు కన్నుమూత

సాయి పల్లవికి పొగరు.. నిర్మాత కూడా సీరియస్..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -