Thursday, March 28, 2024
- Advertisement -

అలాంటి పిల్లల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ : సీఎం జగన్

- Advertisement -

దేశంలో ఈ మద్య కరోనా కేసులు ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపిలో కరోనా కలకలం సృష్టిస్తుంది. ప్రతిరోజూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.. దాంతో పాటే మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. ఈ మద్య కరోనా తో ఇంటి పెద్దలను కోల్పోయి చిన్నారులు అనాథలుగా మిగులుతున్నారు. కరోనా బారినపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయి అనాథలుగా మిగిలిన వారికోసం ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నారు. ఒకే ఇంట్లో అత్యధిక సంఖ్యలో మరణాలు కరోనా కారణంగా సంభవిస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.

ఆ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

ప్రముఖ నటి సుధాచంద్రన్ ఇంట విషాదం..

ఆకట్టుకుంటున్న‘ముగ్గురు మొనగాళ్లు’ ఫస్ట్ లుక్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -