శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లవ్‌స్టోరీ చిత్రం రిలీజ్ డేట్‌పై ఓ తాజా అప్డేట్ వచ్చింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ‘సారంగధరియా’ పాట. ఈ పాట యూట్యూబ్‌ను ఓ ఊపు ఊపేసింది. సాయిపల్లవి హావభావాలు, డ్యాన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నది. ఏప్రిల్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అంతలోనే కరోనా లాక్డౌన్ వచ్చి పడటంతో సినిమా రిలీజ్ ఆగిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో లాక్డౌన్ రావడంతో మే లో రిలీజ్ చేద్దామని భావించారు. కానీ అప్పుడు కూడా కుదిరే అవకాశం లేదు.
Also Read: రౌడీ బాయ్ తో గౌతమ్ తిన్ననూరి మూవీ..!
మరోవైపు దేశంలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. మరోవైపు మూడోవేవ్ అంటూ హెచ్చరికలు వస్తున్నాయి. ఈ క్రమంలో జూన్‌లో సినిమా విడదలయ్యే అవకాశం ఉంది. శేఖర్ కమ్ముల చిత్రాలు ఎంతో సహజంగా ఉంటాయి. దీంతో ప్రేక్షకులు ఆయనకు కనెక్ట్ అయ్యారు. హీరోయిజం, మితిమీరిన హింస ఆయన సినిమాల్లో మచ్చుక మాత్రమైనా కనిపించదు. దీంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ అంతా ఆయన సినిమాలకు కనెక్ట్ అవుతారు. తాజాగా లవ్‌స్టోరీ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు.
Also Read : టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో