Tuesday, April 23, 2024
- Advertisement -

టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

- Advertisement -

‘అలవైకుంఠపురములో ‘ మూవీ ఇండస్ట్రీ రికార్డు కొట్టడం తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ లో ఎన్నడూ లేనంత హుషారుగా ఉన్నాడు. ‘నా పేరు సూర్య ‘ తర్వాత ఒక్క కథ ఎంపిక చేసుకునేందుకే ఏడాదికి పైగా సమయం తీసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ఒకేసారి పలు సినిమాలను లైన్లో పెట్టాడు. అల్లు అర్జున్ లైనప్ చూస్తే వావ్ అనేలా ఉంది. టాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం తెగ ట్రై చేస్తున్నారు.

2004లో వచ్చిన ఆర్య అల్లు అర్జున్ కు తెలుగుతో పాటే మలయాళంలోనూ స్టార్డం తెచ్చింది. అక్కడి హీరోలకు ఏమాత్రం తగ్గకుండా అల్లు అర్జున్ సినిమాలకు కలెక్షన్లు వస్తుంటాయి. తెలుగులో ప్లాప్ అయిన సినిమాలు కూడా అక్కడ హిట్టు కొట్టిన సందర్భాలు ఉన్నాయి.

అయితే అల్లు అర్జున్ మొదట్లో సిట్యుయేషన్ ని క్యాష్ చేసుకుని పాన్ ఇండియా ఇమేజ్ కోసం అంత సీరియస్ గా ప్రయత్నాలు చేయలేదు. తమిళ, తెలుగు భాషల్లో లింగుస్వామితో ఓ సినిమా ప్లాన్ చేసినా అది ఆగిపోయింది. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరగడం, ఆయన ఇక వరుసబెట్టి పాన్ ఇండియా సినిమాలకే పరిమితమవడం, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్ ‘ చేస్తుండటం, మహేష్ తర్వాతి మూవీ రాజమౌళితో ఉండటంతో పాన్ ఇండియా ఇమేజ్ రేసులో తను వెనక పడకూడదని అల్లు అర్జున్ గట్టిగానే నిర్ణయించుకున్నట్లున్నాడు.

Also Read: ఆ పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

తనకు ఎలాగూ ఇప్పట్లో రాజమౌళి దొరికే ఛాన్స్ లేదు కాబట్టి దక్షిణాదిలోని టాప్ డైరెక్టర్లందరినీ తన లైన్లోకే తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అల్లు అర్జున్ . ఇప్పటికే సుకుమార్ తో ఐదు భాషల్లో ‘పుష్ప’ మూవీని మొదలు పెట్టాడు అల్లు అర్జున్. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. పుష్ప షూటింగ్ కంప్లీట్ అవగానే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాకు అల్లు అర్జున్ కమిట్ అయ్యాడు. ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీ పూర్తయ్యాక అల్లు అర్జున్ తో కొరటాల సినిమా చేసే అవకాశం ఉంది. మరో వైపు మురుగదాస్, బోయపాటితో కూడా అల్లు అర్జున్ సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ తో మరో సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు.

దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో అనౌన్స్ చేసిన ‘ఐకాన్’ మూవీ కూడా ఆగిపోలేదని దిల్ రాజు హింట్ ఇచ్చారు. వకీల్ సాబ్ సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ ఆ ప్రాజెక్ట్ ని లైన్ లోనే ఉంచినట్లు టాక్. పుష్పతో పాటు తను నటించే తర్వాతి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండేందుకు అల్లు అర్జున్ ఆసక్తి చూపుతున్నాడు. ఇలా ఇప్పటి యంగ్ అగ్ర హీరోల్లో ఏ హీరోకు లేని విధంగా అల్లు అర్జున్ లైనప్ సెట్ చేసుకున్నాడు. దీనిని బట్టి అల్లు అర్జున్ పాన్ ఇండియా ఇమేజ్ కోసం ఎంత పరితపిస్తున్నాడో అర్థమవుతుంది.

Also Read : టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -