Thursday, April 25, 2024
- Advertisement -

రౌడీ బాయ్ తో గౌతమ్ తిన్ననూరి మూవీ..!

- Advertisement -

యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెలుగులో వచ్చిన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోంది. జెర్సీ ఫేమ్ గౌతమే బాలీవుడ్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.

ఈ సినిమా పూర్తయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించి అఫిషియల్ న్యూస్ రాలేదు. అయితే రామ్ చరణ్ సినిమా కంటే ముందుగానే గౌతమ్ తిన్ననూరి విజయ్ తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత సుకుమార్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సినిమా చేయనున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి – విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా నిర్మితం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

Also Read: టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -