హీరోలు, నటులకు గట్టి క్లాస్​పీకిన మనోజ్​ బాజ్​పాయ్​..!

- Advertisement -

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఓటీటీ దెబ్బతో చాలా మంది స్టార్స్​ గా మారిపోయారు. అయితే ఇంకా చాలా మంది హీరోలు, నిర్మాతలకు థియేటర్​ మోజు వీడలేదు. లాక్​డౌన్​ పూర్తయితే మళ్లీ థియేటర్లలో హవా నడుస్తుందని వాళ్ల అభిప్రాయం. అందుకే చాలా మంది స్టార్​ హీరోలు ఓటీటీ వెబ్​ సీరిస్​లో నటించాలంటే భయపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం తాము ఓటీటీ స్టార్​లుగా మిగిలిపోతామేమోనని, తమ క్రేజ్ తగ్గిపోతుందని వాళ్లు అనుకోవడమే.. ఇదిలా ఉంటే ఫ్యామిలీ మ్యాన్​, ఫ్యామిలీ మ్యాన్​ -2 వెబ్​సీరిస్​తో మనోజ్​ బాజ్​పాయ్​ ఓటీటీ స్టార్​ అయ్యాడు.

అంతకు ముందే ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసిన మనోజ్​.. ఓటీటీ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మనోజ్​ బాజ్​పాయ్ .. నటులకు పలు కీలక సూచనలు ఇచ్చాడు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్​ 1, సీజన్​ 2తో మనోజ్​ బాజ్​పాయ్​ ఫుల్​ ఇమేజ్​ను సొంతం చేసుకున్నాడు. టీనేజర్స్​ సైతం అతడికి ఫ్యాన్స్​గా మారారంటే అతడి క్రేజ్​ ఏ రేంజ్​లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

Also Read: పాన్ ఇండియా డైరెక్టర్ కు.. ఫస్ట్ టైం రిస్కు తప్పదేమో..

ఇటీవల ఓటీటీ గురించి ఆయన మాట్లాడుతూ.. ‘ ఓ నటుడిగా ఆవిష్కరించుకొనేందుకు డిజిటల్​ మీడియా మంచి ప్లాట్​ఫామ్​. ఇక్కడ ఎటువంటి అడ్డంకులు, అడ్డుగోడలు, సెన్సార్​ లాంటి సమస్యలు ఉండవు. ఎంత సున్నితమైన అంశాన్నైనా చెప్పవచ్చు. అయితే కేవలం కొత్తగా ఆలోచించేవాళ్లకు, కొత్తగా నటించేవాళ్లకు మాత్రమే ఇక్కడ స్కోప్​ ఉంటుంది. పాత ఫార్ములాలు పట్టుకొస్తామంటే ఇక్కడ కుదరదు. అటువంటి వాళ్లు డిజిటల్​ మీడియాకు రాకపోవడమే మేలు’ అంటూ చెప్పుకొచ్చారు. మనోజ్​ బాజ్​పాయ్​.

Also Read: టాలీవుడ్ కి కోలీవుడ్ స్టార్ హీరోల క్యూ..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -