Saturday, April 20, 2024
- Advertisement -

‘లవ్​స్టోరీ’ రిలీజ్​ ఎప్పుడంటే?

- Advertisement -

శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవి, నాగచైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లవ్​స్టోరీ చిత్రం రిలీజ్​ డేట్​పై ఓ తాజా అప్​డేట్​ వచ్చింది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్​ చాలా ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం ‘సారంగధరియా’ పాట. ఈ పాట యూట్యూబ్​ను ఓ ఊపు ఊపేసింది. సాయిపల్లవి హావభావాలు, డ్యాన్స్​ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్​ పూర్తిచేసుకున్నది. ఏప్రిల్ లో విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ అంతలోనే కరోనా లాక్​డౌన్​ వచ్చి పడటంతో సినిమా రిలీజ్​ ఆగిపోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ఆగస్ట్​లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్​లో లాక్​డౌన్​ రావడంతో మే లో రిలీజ్​ చేద్దామని భావించారు. కానీ అప్పుడు కూడా కుదిరే అవకాశం లేదు.

Also Read: రౌడీ బాయ్ తో గౌతమ్ తిన్ననూరి మూవీ..!

మరోవైపు దేశంలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. మరోవైపు మూడోవేవ్​ అంటూ హెచ్చరికలు వస్తున్నాయి. ఈ క్రమంలో జూన్​లో సినిమా విడదలయ్యే అవకాశం ఉంది. శేఖర్​ కమ్ముల చిత్రాలు ఎంతో సహజంగా ఉంటాయి. దీంతో ప్రేక్షకులు ఆయనకు కనెక్ట్​ అయ్యారు. హీరోయిజం, మితిమీరిన హింస ఆయన సినిమాల్లో మచ్చుక మాత్రమైనా కనిపించదు. దీంతో ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్​, యూత్​ అంతా ఆయన సినిమాలకు కనెక్ట్ అవుతారు. తాజాగా లవ్​స్టోరీ కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురుచూస్తున్నారు.

Also Read : టాప్ డైరెక్టర్లని ‘అల్లు’ కు పోతున్న స్టార్ హీరో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -