ప్రస్తుతం తెలుగులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే వెంటనే అందరూ ప్రభాస్ పేరు చెప్పేస్తారు. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యాచిలర్ హీరో.. కోసం మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు సైతం అతనంటే పడి చచ్చిపోతున్నారు. ‘రైట్ రైట్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై.. ఇటీవలే ‘ద్వారక’ సినిమాలోనూ తళుక్కుమన్న పూజా జవేరి కూడా ఆ జాబితాలోనే ఉంది.
ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టమట. ప్రభాస్ ఒప్పుకుంటే ఖచ్చితంగా.. పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది పూజా జవేరి. మరి ప్రభాస్ అందుకు ఒప్పుకుంటాడేమో చూడాలి. అమ్మాయిల్లో ఇంత ఫాలోయింగ్.. డిమాండ్ ఉన్న.. ప్రభాస్ ఇంకా పెళ్లి పీటలెక్కకపోవడం ఆశ్చర్యమే. అతడి కి ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేశాయి.
కొంత కాలం నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ప్రభాస్ పెళ్లి విషయం ఏంటో తేలట్లేదు. బాహుబలి సినిమా కంప్లీట్ అవ్వగానే పెళ్లి అవుతుందన్నారు. ఆ సినిమా పూర్తి చేసి కూడా మూడు కావస్తోంది. అయినా ప్రభాస్ పెళ్లి కబురు వినిపించట్లేదు. ప్రభాస్ ఊ అంటే.. బడా ఫ్యామిలీల నుంచి అందమైన అమ్మాయిలు అతడి కోసం క్యూలో ఉంటారు. కృష్ణం రాజు మాత్రం ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పాడు.
Related