Monday, May 6, 2024
- Advertisement -

ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -
Reason Behind Why Prabhas Choose Bahubali

బాహుబలి.. ఈ సినిమాకి ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకించి చెప్పనకర్లేదు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఎస్.ఎస్.రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెండితెర కళాఖండంగా కీర్తిపొందింది. బాహుబలి ఒక బ్రాండ్ గా మారిపోయింది. అంటువంటి సినిమా కోసం కష్టపడడంలో తప్పులేదు. కానీ నాలుగేళ్ళ పాటు అంకితం కావడం అంటే సామాన్యమైన విషయం కాదు.

రాజమౌళితో పాటు ఈ మూవీకోసం నడిచిన అలుపెరగని బాటసారి ప్రభాస్. ఇంకా బాహుబలి షూటింగ్ మూడ్ నుంచి యంగ్ రెబల్ స్టార్ బయటికి రాలేక పోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్  అంతలా కష్టపడటానికి కారణం ఏమిటి? అనే ప్రశ్న చాలా మందికి వచ్చే ఉంటుంది.

దానికి కథ అని, పేరు అని, డబ్బు అని రకరకాలుగా సమాధానం చెబుతుంటారు. అసలు డార్లింగ్ ఏమన్నారో తెలుసా… “నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం పనిచేయడానికి ముఖ్య కారణం రాజమౌళి. ఆయనే నా ఇంట్రస్టింగ్ పాయింట్. ఆయన పని, ప్యాషన్ నాకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రతి పది రోజులకి స్క్రిప్ట్ కొత్తగా చూపిస్తారు. ఆ సీన్ చేయాలనే ఇంట్రస్ట్ కలిగిస్తారు. అలా ప్రతివారం ఫ్రెష్ ఫీలింగ్ తో షూటింగ్ కి వెళ్ళేవాణ్ణి. నేనే కాదు అందరికీ అలాంటి అనుభూతిని కలిగించారు రాజమౌళి. ఆయన లేకుంటే సినిమా చేయలేము” అని దర్శకధీరుడిపై ప్రశంసల జల్లు కురిపించారు. 

{youtube}OZCTQYxMUsM{/youtube}

Related

  1. బాహుబలి కొత్త ఫోటో అదిరింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!
  2. మోడీకి షాకిచ్చిన బాహుబలి!!
  3. బాహుబలి 2 వీడియో లీక్!
  4. బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఆకస్మిక ఐటీ దాడులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -