హ్యాపీడేస్‌తో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైంది మిల్కీ బ్యూటీ తమన్నా.. అంతకుముందే మనోజ్ శ్రీ అనే ఓ సినిమాలో నటించినా పెద్దగా పేరుతీసుకురాలేదు. హ్యాపీడేస్ తర్వాత మిల్కీ బ్యూటీకి తెలుగు, తమిళంలో అటు హిందీలో వరస అవకాశాలు వచ్చాయి. కానీ ఈ మధ్య తమన్నా కొంచెం డల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె గోపిచంద్‌తో చేస్తున్న సీటీమార్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఆహాలో ఓ వెబ్‌సీరిస్‌లో కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే తమన్నాకు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ దక్కినట్టు టాక్ వినిపిస్తుంది. కేజీఎఫ్ హీరో యశ్.. తాజాగా ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా ఎంపికైనట్టు టాక్. కేజీఎఫ్ 1 లో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో అలరించింది. ఇప్పుడు ఏకంగా యశ్ సినిమాలో హీరోయిన్గా చాన్స్ కొట్టేసినట్టు టాక్. ఇప్పటికే వరస అవకాశాలు లేక వెనకబడ్డ తమన్నాకు.. ఈ సినిమా హిట్ కొడితే మళ్లీ వరస అవకాశాలు రావడం ఖాయడం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: కేజీఎఫ్- 2 రాక ఇప్పట్లో కష్టమే.. !
కేజీఎఫ్‌తో యశ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నటించిన కేజీఎఫ్-2 విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ క్రమంలో మరోమూవీకి యశ్ ఓకే చెప్పాడు. ముఫ్తీ ఫేమ్ నార్తన్ డైరెక్షన్ లో ఆయన మరో సినిమా చేయబోతున్నాడు. ఇందులో యశ్.. నెవీ అధికారిగా కనిపించబోతున్నట్టు టాక్. హోంబలే ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. ఈ మూవీలోనూ యశ్ మాస్ లుక్స్‌లో అదరగొట్టనున్నాడు. ఇక తమన్నాకు ఎటువంటి క్యారెక్టర్ ఇస్తారో వేచి చూడాలి.
Also Read: మురుగదాస్ – కమల్ కాంబినేషన్ లో సినిమా..!